Shani pooja Vidhanam: శనిదేవుడిని పూజించాలంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. అవి పాటించకపోతే..ఆ వ్యక్తి శనిదేవుడి ఆగ్రహానికి గురవుతాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యాయ, కర్మ దేవతగా ఉన్న శని ఒకవేళ ఎవరైనా వ్యక్తిపై దయ చూపిస్తే..ఇక ఆ వ్యక్కితి అంతులేని సుఖ సంతోషాలు అందిస్తాడు. అదే సమయంలో కోపగిస్తే ఆ వ్యక్తిని రోడ్డున పడేస్తాడు. వ్యక్తి సమస్యలు తొలగే పరిస్థితే ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జీవితంలో కనీసం ఒకసారైనా శని పీడ, శని దుష్ప్రభావావాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది. 


ఈ నేపధ్యంలో ఆ వ్యక్తి శనిదేవుడి ఆగ్రహం నుంచి రక్షించుకునేందుకు విధి విధానాలతో పూజలు చేయాలి. శనిదేవతకు ఇష్టమైన వస్తువులు సమర్పించాలి. తద్వారా శనిదేవుడి కటాక్షం ఉంటుంది. కానీ చాలాసార్లు పూజ చేసేటప్పుడు కూడా తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఇవి శనిదేవుడి ప్రసన్నానికి బదులు ఆగ్రహాన్ని కొనితెస్తాయి. ఇంకేముంది..శని ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. 


శనిదేవుని పూజ చేసేటప్పుుడు శనిదేవుడి కళ్లలో చూస్తూ పూజలు చేయకూడదు. పూజ చేసేటప్పుడు కళ్లు మూసుకోవాలి. శని పాదాలవైపు చూస్తూ పూజ చేయాలి. శనిదేవుని కళ్లలో కళ్లు పెట్టి పూజలు చేస్తే..ఆ దృష్టి మీపై పడే ప్రమాదముంది. 


శనిదేవుని పూజ సమయంలో నిటారుగా నిలబడకూడదు. దాంతోపాటు పూజ తరువాత అక్కడి నుంచి వెళ్లేటప్పుడు..ఎలా నిలుచుని ఉన్నారో..అదే స్థితిలో వెనక్కి రావాలి. అంటే శనిదేవునికి వీపు చూపించకూడదు. లేకపోతే ఆగ్రహానికి గురవుతారు. 


శనివారం నాడు శనిదేవుని విగ్రహానికి ఆముదం నూనె సమర్పించాలి. సాధారణంగా ఇత్తడి పళ్లెం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఈసారి ఇనుప పళ్లెం వినియోగించాలి. ఇత్తడి సూర్యునికి కారకం. శనిదేవుని పూజించే సమయంంలో దిశను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సాధారణంగా భక్తజనం తూర్పు దిశవైపు ముఖం పెట్టి..పూజలు చేస్తుంటారు. కానీ శనిదేవుడు పశ్చిమ దిశకు అధిపతి అయినందున..శనిదేవుని పూజించేటప్పుడు పశ్చిమ దిశవైపు అభిముఖం చేసి పూజలు చేయాలి. 


Also read: Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు! అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook