Lord Shani never comes to you If you are devotee of  Lord Krishna, Shiva and Hanuman: శని దేవుడి పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో ఒరకమైన భయం ఉంటుంది. ఎందుకంటే.. ఒక వ్యక్తి జాతకంలో శని గ్రహ స్థానం సరిగా లేని వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శని దేవుడు గ్రహ ప్రపంచంలో న్యాయమూర్తి హోదాలో ఉంటాడు. శని దేవుడు ఓ వ్యక్తికి అతడి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అయితే శని దేవుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి మాత్రం రారాజు అవుతాడు. అదే సమయంలో శని ఉన్న వ్యక్తి పాతాళానికి పోతాడు. శని దేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లేందుకు రెండున్నరేళ్ల సమయం పడుతుంది. ఇంత నెమ్మదిగా మరే గ్రహం కదలదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దేవుడిని ఆరాధించే అనేక మార్గాలు జ్యోతిషశాస్త్రంలో ఉన్నాయి. శని కోసం అందరూ ఎన్నో పరిహారాలు చేరారు. అయితే ఎలాంటి పరిహారాలు చేయకున్నా.. శని ఈ ముగ్గురు దేవతల భక్తులను ఎప్పుడూ బాధపెట్టడు. ధైయా మరియు సడే సతి జరుగుతున్నా.. వారిని ఏమీ చేయడు. శని దేవుడు ఏ దేవతలను ఆశీర్వదించాడో ఇప్పుడు ఓసారి చూద్దాం.


పౌరాణిక గ్రంధాల ప్రకారం శని దేవుడు కర్మలను ప్రసాదించేవాడు. శని ఒక వ్యక్తి యొక్క మంచి మరియు చెడుల అతడి కర్మలను బట్టి ఇస్తాడు. 2023 జనవరి 17న శని కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర, కుంభ, మీన రాశుల్లో శని దేవుని సడే సతి ప్రారంభమవుతుంది. కుంభ రాశిలో శని దేవుడి నిష్క్రమణ తరువాత కర్కాటక మరియు వృశ్చిక రాశిలో ధైయ ప్రారంభమవుతుంది. ఇక  మిథున మరియు తుల రాశి ప్రజలు ధైయా కోపం నుంచి విముక్తి పొందుతారు.


శ్రీకృష్ణుడు:
మీరు శ్రీకృష్ణుని భక్తులైతే శని దేవుడు మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే శని దేవుడు శ్రీకృష్ణుడిని పూజిస్తాడు. మధురలోని కోశికాలన్‌లోని కొలికావనంలో శ్రీకృష్ణుని కోసం శని తపస్సు చేశాడు. దాంతో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో అతనికి ప్రత్యక్షమయ్యాడు. అందుకే శ్రీ కృష్ణుడిని పూజించిన వారికి శని దేవుడు మంచి ఫలాలను ఇస్తాడు.


శివుడు:
శని దేవుడు శివ భక్తులపై తన ఆశీర్వాదాలను ఉంచుతాడు. శని దేవుడి తన తండ్రి సూర్య మరియు తల్లి ఛాయల కోసం శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు శనిని గ్రహాల న్యాయమూర్తిగా చేసాడు. అందుకే శివుడిని పూజించే వారిని శని దేవుడు ఎప్పుడూ బాధించడు.


హనుమంతుడు:
శని దేవుడినే కాకుండా.. హనుమంతుడిని శని మరియు మంగళ వారాల్లో భక్తులు పూజిస్తారు. ఓ ఘటన సందర్భంగా హనుమంతుడి భక్తులకు హాని చేయనని శని వాగ్దానం చేస్తాడు. అందుకే హనుమంతుడి భక్తులను శని ఏమీ చేయలేడు. 


Also Read: Pawan Kalyan: వారాహి కలర్ వివాదంపై పవన్ కళ్యాణ్ పంచ్.. జనసేనానిని ఇంట్రెస్టింగ్ ట్వీట్


Also Read: Himachal Pradesh CM: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు.. రేసులో ఉన్నది వీళ్లే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.