Dussehra 2022 Remedy: ఈ 5 రాశులవారు దసరా రోజు ఇలా చేస్తే... శనిదేవుడి అనుగ్రహాన్ని పొందుతారు.. ఇక వీరికి తిరుగుండదు..
Dussehra 2022 Upay: శనిమహాదశతో బాధపడుతున్న వ్యక్తులు దసరా రోజు ఈ పరిహారం చేయడం ద్వారా దానిని నుండి బయటపడవచ్చు.
Shani Sade Sati Dhaiya Remedy: దసరా లేదా విజయదశమి శుభ కార్యాలు చేయడానికి, విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం. దీంతోపాటు శని దేవుడి (Shani Dev) అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా మంచిది. దీని కోసం దసరా రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం 5 రాశులవారి మీద శనిమహాదశ కొనసాగుతుంది.
ప్రస్తుతం మకరం, కుంభం, ధనుస్సు, మిథునం మరియు తుల రాశులవారిపై శని సడేసతి మరియు ధైయా కొనసాగుతోంది. శనిమహాదశ ఎవరిపై ఉందో ఆ వ్యక్తికి ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోంటారు. ఎవరి జాతకంలో శని అశుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. శని బాధల నుండి ఉపశమనం పొందడానికి ఈ రాశుల వారు దసరా రోజున (Dussehra) శమీ వృక్షానికి సంబంధించిన ప్రత్యేక పరిహారాన్ని చేయండి.
ఇంట్లో శమీ మొక్కను నాటండి..
దసరా రోజున శని సడేసతి లేదా ధైయాతో బాధపడుతున్న 5 రాశులవారు శమీ మెుక్కను నాటాలి. దీంతో శని ప్రసన్నుడై శుభఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా శని మహాదశ యెుక్క దుష్ర్పభావాల తొలగిపోతాయి. ఇందుకోసం విజయదశమి రోజున తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత కుండీలో మట్టిని తీసుకుని శమీ మెుక్కను నాటండి. దీంతోపాటు ఆ మట్టిలో తమలపాకులు మరియు రూపాయి నాణెం నొక్కాలి. దీనికి పసుపు నీళ్లు పోయండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. అలాగే ఈ మెుక్క ఎంత పెరుగుతుందో ఆ వ్యక్తి అంతగా అభివృద్ధి చెందుతాడు.
Also Read: Dussehra 2022: విజయదశమి రోజున ఈ పుష్పాల మొక్కను పూజిస్తే డబ్బే..డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి