Shani Dev: 2025 వరకు విపరీతమైన ధన లాభాలు పొందబోతున్న రాశుల వారు వీరే.. మీ రాశి ఉందా?
Shani Dev: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం కదలికల కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో వస్తున్న కష్టాలు కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే అభివృద్ధి కూడా పెరుగుతుంది.
Shani Dev: జాతకంలో శని శుభస్థానంలో ఉంటే జీవితంలో సంతోషానికి డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు. అందుకే ఈ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో అంత ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం ఈ శని గ్రహం కుంభ రాశిలో సంచార క్రమంలో ఉంది. ఈ సంవత్సరం చివరి నెల వరకు అంటే 2025 సంవత్సరం మొదటి నెల వరకు అదే రాశిలో శని సంచార దశలోనే కొనసాగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే శని అతి త్వరలోనే తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శని గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి అదృష్టం రెట్టింపబడమే కాకుండా ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అయితే శని తిరోగమనతో బాగుపడే రాశుల వారెవరో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శని తిరోగమన కారణంగా లాభాలు పొందబోయే రాశులు..
ధనస్సు రాశి:
కుంభరాశి శని తిరుగమనం చేయడం కారణంగా ముందుగా ధనస్సు రాశి వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి బాస్ సపోర్టు లభించి, ఎలాంటి పనులైన చక్కగా చేయగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు విదేశీ పర్యటనలు కూడా చేసే ఛాన్స్ ఉంది. దీంతోపాటు వీరు ఈ సమయంలో ఆరోగ్యాన్ని తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
తులారాశి:
తులా రాశి వారికి శని అనుగ్రహంతో ఏళ్ల నుంచి నిలిచిపోయిన పనులు ఈ సమయంలో సులభంగా జరుగుతాయి. అలాగే జీవితంలో సంతోషం కూడా ప్రారంభమవుతుంది. ఇక కుటుంబ జీవిత విషయానికి వస్తే వివాదాలన్నీ తొలగిపోయి శాంతి వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. శని ప్రభావం కారణంగా ఆర్థికంగా కూడా తులా రాశి వారు బలపడతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయంలో అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శని దేవుడి అనుగ్రహం లభించి జీవితంలో వస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఆనందం శాంతి వాతావరణం ఒక్కసారిగా పెరిగిపోతుంది. అంతే కాకుండా ఎలాంటి పనులు చేసిన డబ్బులు సాధించగలుగుతారు. అలాగే సంపాదన కూడా అంచలంచెలుగా పెరుగుతుంది. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి