Shani Planet Set In Kumbh:  వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. కర్మను ఇచ్చే శనిదేవుడు ఫిబ్రవరి 3న కుంభరాశిలో అస్తమించబోతున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. శనిదేవుడి అస్తమయం (Shani Asta 2023) మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు లాభాలతోపాటు పురోభివృద్ధిని సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడు అస్తమయం ఈ రాశులకు శుభప్రదం
మకర రాశిచక్రం (Capricorn): మకర రాశి వారికి శనిదేవుని అస్తమయం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి రెండవ ఇంట్లో అస్తమించబోతున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వ్యాపారవేత్తలు భారీగా లాభాలను గడిస్తారు. విదేశీ ప్రయాణం మీకు అద్భుతంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీడియా లేదా మార్కెటింగ్ కు సంబంధించిన వారికి ఈ సమయం కలిసి వస్తుంది.


మేష రాశిచక్రం (Aries): శనిదేవుడు అస్తమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో 11వ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తాడు. దీంతో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగం మారడానికి ఇదే మంచి సమయం. మీకు డబ్బు, పదవి రెండూ లభిస్తాయి. మీరు షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలను పొందుతారు. 


కుంభం (Aquarius): శని దేవుడి అస్తమయం మీకు కెరీర్ మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆరోహణ ఇంట్లో శనిదేవుడు అస్తమించబోతున్నాడు. అందుకే ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతోపాటు మీ ఆఫీసులో ప్రాబల్యం పెరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో శనిదేవుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. 


Also Read: Surya Dev: ఈ ఏడాది సూర్యుడు తన రాశిని ఎప్పుడు, ఎన్నిసార్లు ఛేంజ్ చేయనున్నాడో తెలుసా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook