Shani Enter Shatabhisha Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశిచక్ర గుర్తులను మరియు నక్షత్రరాశులను మారుస్తాయి. వచ్చే నెల 14న కర్మదాత, న్యాయదేవుడు అయిన శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. రాహువు మరియు శనిదేవుడి మధ్య స్నేహ భావం ఉంది. అందుకే ఈ మార్పు ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. శని శతభిషా నక్షత్రం ప్రవేశం మూడు రాశులవారికి ఆకస్మిక ధనలాభం, పురోభివృద్ధి కలుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి
శతభిషా నక్షత్రంలోకి శనిదేవుడి ప్రవేశం మీకు వరమనే చెప్పాలి. ఎందుకంటే శనిదేవుడు మీ జాతకంలో శష్ మరియు కేంద్ర త్రికోణ రాజ్యయోగాన్ని చేస్తున్నాడు. దీని కారణంగా మీరు మీ కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది.  నిరుద్యోగులకు కొత్త జాబ్ వస్తుంది. పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయాలు, ఇంజినీరింగ్‌, మెడికల్‌ రంగాలతో సంబంధం ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. 
సింహ రాశి
శనిదేవుడి రాశిలో మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ జాతకంలో ఏడవ ఇంట్లో శని సంచరిస్తుంది. మీకు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో లాభం ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. 
మకర రాశిచక్రం
శతభిషా నక్షత్రంలోకి శని దేవుడి ప్రవేశం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రెండవ ఇంట్లో సంచరిస్తాడు. దీనితో పాటు మీ లగ్నానికి శని దేవుడే అధిపతి. మీ లైఫ్ పార్టనర్ తో సంబంధాలు బాగుంటాయి. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.  ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. 


Also Read: Mahalaxmi Rajyog: 'మహాలక్ష్మి రాజయోగం' చేస్తున్న కుజుడు-చంద్రుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.