Shani Made Mahapurush Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని దేవుడి సంచార ప్రభావం దేశం మరియు ప్రపంచంతో సహా అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవత, కర్మదాత అంటారు. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో ఉన్నాడు. మళ్లీ వచ్చే ఏడాది జనవరి 17న శనిదేవుడు కుంభరాశిలో (Saturn Transit in Aquarius 2022) సంచరించనున్నాడు. దీని కారణంగా మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరం (Capricorn): మహాపురుష రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీన్నే డబ్బు మరియు మాటల ప్రదేశం అంటారు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.ఈ సమయంలో మీరు నీలరాయిని ధరించడం వల్ల మీకు అదృష్టం వస్తుంది.


మిథునం (Gemini): మహాపురుష రాజయోగం మీకు వృత్తి మరియు వ్యాపార పరంగా లాభిస్తుంది.  ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. దీన్నే అదృష్టం మరియు విదేశీ ప్రదేశం అని పిలుస్తారు. అందువల్ల మీకు ప్రతి విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో లాభపడతారు. 


వృషభం (Taurus): రాజయోగం వల్ల మీకు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే శనిదేవుడు మీ జాతకంలో 10వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఇది వర్క్‌స్పేస్ మరియు జాబ్ లొకేషన్ సంబంధించినదిగా భావిస్తారు. దీంతో ఈ సమయంలో కొత్త జాబ్ ఆఫర్‌ను పొందవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఆఫీసులో సహచరుల మద్దతు లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. 


Also read: Mangal Vakri 2022: వృషభ రాశిలోకి తిరోగమన కుజుడు... ఈ రాశుల వారు జాగ్రత్త.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook