Shani Gochar 2023: త్రికోణ స్థితిలో కుంభరాశిలో సంచరించనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..
Shani Gochar 2023: పంచాంగం ప్రకారం, శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలో సంచరించబోతున్నాడు. శని దేవుడి యొక్క ఈ సంచారం మూడు రాశులవారికి అనుకూలంగా ఉండనుంది.
Shani Gochar 2023: కర్మదేవుడు అయిన శనిదేవుడు ఒక రాశి నుండి మరొక రాశికి చాలా నెమ్మదిగా కదులుతుంది. ప్రస్తుతం మకరరాశిలో ఉన్న శనిగ్రహం జనవరి వరకు అదే రాశిలో ఉండనున్నాడు. ఆ తర్వాత అంటే జనవరి 17, 2023 నాడు త్రికోణ స్థితిలో కుంభరాశిలో (Shani Gochar 2023) సంచరించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. శనిదేవుడు సంచారం వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. శనిదేవుడి యెుక్క ఈ రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మిథునం (Gemini): కుంభ రాశిలో శని గ్రహ సంచారం మీకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశి నుండి తొమ్మిదో ఇంట్లో సంచరించబోతున్నాడు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు ఆదా చేయడానికి ఇదే మంచి సమయం. పని మరియు వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
సింహం (Leo): సింహ రాశి వారికి శని సంచారం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏడవ ఇంట్లో శనిదేవుడు సంచరించబోతున్నాడు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మీరు ఆఫీసులో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశంఉంది. మీరు భాగస్వామ్యంతో చేసే పనిలో మంచి విజయాన్ని సాధిస్తారు. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.
మీనం (Pisces): శని దేవుడి రాశి మార్పు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి శని దేవ్ సంచార జాతకంలో 12వ ఇంట్లో ప్రయాణించబోతున్నాడు. మీరు డబ్బును పొదుపు చేస్తారు. ఫ్యామిలీలో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కొత్త కారు లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది.
Also Read; Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రులు ప్రారంభం ఎప్పుడు? దీని విశిష్టత ఏంటో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి