Shani dev: రాహువు యెుక్క నక్షత్రంలోకి ప్రవేశించబోతున్న శని.. మార్చి 14 నుండి ఈ రాశులకు మనీ మనీ మోర్ మనీ...
Shani dev: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.
Shani Enter Shatabhisha Nakshatra: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. మార్చి 14న శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ స్టార్ కు అధిపతి రాహువు. పైగా శని, రాహువు ఇద్దరూ మిత్రులు. శతభిషా నక్షత్రంలో శనిదేవుడు సంచారం మూడు రాశులవారికి మేలు చేయనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
శనిదేవుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం
శనిగ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది. మీ జాతకంలో 12వ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీ పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా ధనాన్ని ఆర్జిస్తారు.
మిథున రాశిచక్రం
శతభిషా నక్షత్రంలోకి శని దేవుడి ప్రవేశం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంద. మీకు మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఫ్యామిలితో మంచి సంబంధాలు ఉంటాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది.
తులా రాశిచక్రం
శతభిషా నక్షత్రంలో శని సంచారం తులరాశి విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు పని-వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. బిజినెస్ చేసేవారు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
Also Read: Mangal Gochar 2023: మిథునరాశిలోకి ప్రవేశించబోతున్న కుజుడు.. హోలీ తర్వాత మారనున్న ఈరాశుల జాతకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook