Fatty Liver Diet: ఈ 5 ఫుడ్స్ కాలేయంలో పేరుకున్న విషపూరిత పదార్థాలను బయటకు తరిమేస్తాయి..

Fatty Liver Diet: ఫ్యాటీ లివర్ కాలేయంలో అతిగా కొవ్వులు చేరడం వల్ల వస్తుంది. దీంతో కాలేయం పరిమాణం కూడా పెరిగిపోతుంది. ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ రెండు రకాలు ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్. నాన్‌ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మందు తాగని వారికి కూడా వస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 4, 2024, 05:43 PM IST
Fatty Liver Diet: ఈ 5 ఫుడ్స్ కాలేయంలో పేరుకున్న విషపూరిత పదార్థాలను బయటకు తరిమేస్తాయి..

Fatty Liver Diet: ఫ్యాటీ లివర్ కాలేయంలో అతిగా కొవ్వులు చేరడం వల్ల వస్తుంది. దీంతో కాలేయం పరిమాణం కూడా పెరిగిపోతుంది. ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ రెండు రకాలు ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్. నాన్‌ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మందు తాగని వారికి కూడా వస్తుంది. లేదా కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నవారికి వస్తుంది. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నవారు, డయాబెటిక్, మెడిసిన్స్‌ ఎక్కువ కాలంపాటు తీసుకున్నవారికి ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుంది. ఈ సమయంలో మన కాలేయం ఖనిజాలను ప్రాసెస్‌ చేయదు. దీంతో లివర్‌ ఫైబ్రోసిస్, సిర్రోసిస్‌ కు దారితీస్తుంది. కాలేయం పనిచేయకుండా పోతుంది.

ఫ్యాటీ లివర్‌ లక్షణాలు..
పొత్తికడుపులో కుడి పార్ట్‌లు నొప్పి అనుభూతి కలుగుతుంది.  వీక్‌నెస్, వెయిట్‌ లాస్‌, కాళ్లలో వాపు ఇవన్నీ ఫ్యాటీ లివర్‌ లక్షణాలు.

ఫ్యాటీ లివర్‌కు కారణాలు..
ఆల్కహాల్‌ అతిగా సేవించిన వారికి ఒక వారంలో 15 డ్రింక్స్‌ లేదా అంతకంటే ఎక్కువగా తాగేవారికి ఆడవాళ్లు 8 డ్రింకులు తాగేవారికి ఈ ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుందట.లివర్‌ ఫెయిల్యూర్‌ కూడా అవుతుందట.ఒబేసిటీ, ఇన్సూలిన్ రెసిస్టెన్స్, టైప్‌ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, హై కొలెస్ట్రాల్ లెవల్స్, మెడిసిన్స్ సైడ్‌ ఎఫెక్ట్స్‌, జెనిటిక్ డిజార్డర్, హెపటైటిస్ సీ ఇన్ఫెక్షన్స్‌ కూడా కారణాలు

ఫ్యాటీ లివర్‌కు చెక్‌ పెట్టే ఆహారాలు..
నిమ్మకాయ.. 
ఒక గ్లాసు నీటిలో అరచెక్క నిమ్మకాయను పిండుకోవాలి. దీన్ని పరగడుపున ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. నిమ్మకాయ టాక్సిన్స్‌ మన శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపించేస్తుంది. లివర్‌ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బొప్పాయి..
ఖాళీ కడుపున ఒక్క బౌల్‌ బొప్పాయి ముక్కలను తీసుకోవాలి. బొప్పాయిలో ఉండే ఎంజైమ్ లివర్ మంట సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు బొప్పాయిలో విటమిన్ ఏ సీ కూడా ఉంటాయి.

ఇదీ చదవండి: ఈ 5 కొలెస్ట్రాల్‌ను సహజంగా.. ఎఫెక్టివ్‌గా బర్న్‌ చేసే మార్నింగ్‌ డ్రింక్స్.. 

యాపిల్స్‌..
యాపిల్స్‌లో పెక్టిన్ ఉంటుంది. ఇది మన లివర్‌ను క్లెన్స్‌ చేస్తుంది. కాలేయం నుంచి విష పదార్థాలు బయటకు పంపించడానికి సహాయపడుతుంది, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుచేస్తుంది. యాపిల్‌ ప్రతిరోజూ ఒకటి తీసుకుంటే ఫ్యాటీ లివర్‌ ను రాకుండా చేస్తుంది. ఫ్యాటీ లివర్‌ సమస్యలతో బాధపడేవారు మూడు పూటల యాపిల్స్ తినాలి. వీటిని ఖాళీ కడుపున తీసుకోవాలి.

బీట్‌రూట్‌..
విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు బీట్‌రూట్‌లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కాలేయ వ్యాధులను రాకుండా నివారిస్తుంది. కాలేయ పనితీరుకు ప్రోత్సహిస్తుంది. ఒక మీడియం సైజ్‌ బీట్‌రూట్‌ తీసుకుఉంటే మంచిది. క్యారట్‌, బీట్‌రూట్‌ కలిపి సలాడ్‌ తయారు చేసుకోవాలి.

ఇదీ చదవండి: గుడ్లను ఎండకాలం మీ డైట్లో చేర్చుకుంటే 5 ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ, వీరు మాత్రం అస్సలు తినకూడదు జాగ్రత్త..

పచ్చకూరగాయలు..
గ్రీన్‌ కూరగాయల్లో క్లోరోఫిల్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి విషపూరిత టాక్సిన్స్‌ను బయటకు పంపించేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయం కోసం పాలకూర, గ్రీన్‌ పీస్, కాకరకాయ, బ్రోకోలి, కాలీఫ్లవర్, లెట్యూస్‌ వంటివి తీసుకోవాలి. ప్రతిరోజూ 100-150 గ్రాముల ఉడికించిన లేదా ఆవిరి చేసిన కూరగాయలను మీ డైట్లో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News