Oneplus Nord CE4: అమెజాన్‌లో Oneplus Nord CE4 మొబైల్‌ ఇప్పుడు రూ.2,000కే.. లిమిటెడ్‌ ఆఫర్!

Oneplus Nord CE4 Price Down: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్ ప్లస్ మొబైల్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే మీరు కూడా ఈ బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ఆమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 4, 2024, 09:09 PM IST
Oneplus Nord CE4: అమెజాన్‌లో Oneplus Nord CE4 మొబైల్‌ ఇప్పుడు రూ.2,000కే.. లిమిటెడ్‌ ఆఫర్!

Oneplus Nord CE4 Price Down: అతి తక్కువ ధరకి ప్రీమియం ఫీచర్స్ కలిగిన వన్ ప్లస్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్ ప్లస్ లార్డ్ సిఈ 4 (Oneplus Nord CE4 )మొబైల్ అమెజాన్‌లోని గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీంతో పాటు ఇతర వన్ ప్లస్ మొబైల్స్ కూడా తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 128GB కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం దాదాపు 30 శాతం వరకు తగ్గింపుతో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించు కొనుగోలు చేసే వారికి అతి తక్కువ ధరలోనే లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న మొత్తం ఆఫర్స్ ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

వన్ ప్లస్ కంపెనీ మార్కెట్లోకి ఈ Oneplus Nord CE4 స్మార్ట్ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్‌పై అమెజాన్ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే ఆరు నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ ధర MRP రూ.24,998 లభిస్తోంది. అలాగే అమెజాన్‌లో కూడా ఇదే ధరతో అందుబాటులో ఉంది. కానీ మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనంగా అద్భుతమైన బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

ఈ Oneplus Nord CE4  మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1 వెయ్యి  వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వినియోగించే వారికి కూడా రూ.1 వెయ్యి వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు వన్ కార్డు క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించే వారికి కూడా ఈ తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి బిల్ చెల్లించిన పై డిస్కౌంట్ పొందవచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అంతేకాకుండా అమెజాన్ ఈ కొత్త Oneplus Nord CE4 మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ని కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపుతో మొబైల్‌ను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ను వినియోగించడానికి ముందుగా చేయాల్సింది ఒకటే.. దీనికోసం మీరు పాత ఫోన్‌ని ఆమెజాన్‌కి ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.23 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ Oneplus Nord CE4 మొబైల్‌ను కేవలం రూ.2,000కే వరకు పొందవచ్చు. ఇదే కాకుండా అమెజాన్ EMIకి సంబంధించిన ప్రత్యేకమైన ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. వీటి వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్‌ని సందర్శించడం మంచిది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News