COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Dev Chalisa: ఆషాఢ మాసం జూన్ 5, సోమవారం నుంచి ప్రారంభమైంది. జూన్ 10న ఆషాఢమాసంలో మొదటి శనివారం కూడా వచ్చింది. ఇలా వచ్చే ఒటికి, రెండు శని వారాలకు జ్యోతిష్య శాస్త్రంలో మంచి ప్రాముఖ్య ఉంది. శని దేవిడికి ఈ రెండు శనివారాల్లో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక నియమాలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో లక్ష్మిదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం..అయితే ఈ రోజు శని దేవుడిని ఎలా పూజించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇలా శని దేవుడిని పూజించండి:
1. ఇలా పూజా చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది:
ఎవరి జాతకంలో శని ఆశుభ స్థానంలో ఉంటే వారికి జీవితంలో తీవ్ర నష్టాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శని వారం శని దేవుడి ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాకుండా ఈ రోజు నల్ల వస్తులను దానం చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 


2.శనివారం హనుమంతుడి ఆరాధన చేయడం వల్ల కూడా శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. హనుమంతునికి సింధూరాన్ని సమర్పించి, నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం కూడా సులభంగా లభిస్తుంది. 


Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్


3.ప్రతి శనివారం శని పూజలో భాగంగా హనుమంతుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా హనుమంతుడికి ముందు ఆవనూనె దీపం వెలిగించాల్సి ఉంటుంది. శని దుష్ప్రభాలు తొగిపోవడానికి నీలిరంగు పుష్పాలను సమర్పించాల్సి కూడా ఉంటుంది. 
    
4. శని పూజలో భాగంగా తప్పకుండా మంత్రాలను పఠించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు తొచిన కాడికి పేదలకు సహాయం కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సులభంగా శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


ఈ శని మంత్రాన్ని తప్పకుండా పఠించండి:
ఓం నీలాంజన్ సమభాషన్ రవిపుత్రన్ యమాగ్రజం.
ఛాయామార్తాండ్ సంభూతం తాన్ నమామి శనిశ్చరమ్.


శని దోష నివారణకు మంత్రం ఇదే:
మంత్రం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్.
ఉర్వారుకమివ్ బన్ధనన్ మృత్యోర్ముక్షీయ మా మృత్యత్ ।     


Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook