Shani Gochar 2022: మకరరాశి నుంచి శని తిరోగమనం.. ఈ మూడు రాశుల వారు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతారు..!
Shani Gochar 2022: ఈ వారంలో శని సంచారము రాశిచక్రపై పెద్ద ప్రభావం చూపబోతుంది. 12 జూలై 2022న శని తన సొంత రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించింది. నిన్న కుంభరాశి నుంచి శని తిరోగమనం అయ్యి.. మకర రాశికి చేరుకున్నారు.
Shani Gochar 2022: ఈ వారంలో శని సంచారము రాశిచక్రపై పెద్ద ప్రభావం చూపబోతుంది. 12 జూలై 2022న శని తన సొంత రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించింది. నిన్న కుంభరాశి నుంచి శని తిరోగమనం అయ్యి.. మకర రాశికి చేరుకున్నారు. ఈ శని సంచారం వల్ల 3 రాశుల వారు మంచి లాభాలు పొందబోతున్నారు. అంతేకాకుండా ఆ రాశుల వారు వృత్తి-వ్యాపారంలో బలమైన పురోగతిని పొంది. ధన లాభాలు పొందుతారు. ఏ 3 రాశుల వారికి శని ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
ఈ రాశుల వారిపై శని ప్రభావం:
వృషభం(Taurus):
మకరరాశి నుంచి శని తిరోగమన వృషభ రాశిలోకి ప్రవేశించినందున ఈ రాశి వారు ఆర్థిక పరంగా మంచి లాభాలను అశించనున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు ఉద్యోగ్యాలు పొందుతారు. ముఖ్యంగా వ్యపారాలు చేస్తున్నవారు మంచి లాభాలను పొందుతారు. ఊహించని ధనలాభం తొందర లోనే పొందుతారు. ఒంటరి వ్యక్తులు జీవిత భాగస్వామిని పొందుతారు.
ధనుస్సు(Sagittarius):
శని రాశి మారడం వల్ల ధనుస్సు రాశి కూడా పెద్ద మొత్తంలో ధనాన్నిపొందుతారు. అంతేకాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. నిలిచిపోయిన డబ్బును పొందుతారు. పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలు వీరికి లభిస్తాయి.
మీనం(Pisces):
మకరరాశి వారు కూడా మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారులైతే.. అధిక లాభం చేకూరుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు పెట్టుబడులు కూడా పెడితే మంచి లాభాలు లభిస్తాయి. కావున మీన రాశి వారు ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. పాత వ్యాధులు, వివాదాస్పద విషయాలు తొలగిపోతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Read also: Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్పుడు రిలీజంటే?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook