Shani Gochar 2023 to 2025 Effect: గ్రహాలన్నీ ఒక్క రాశిలో ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఏదో ఒక రాశిలోకి సంచారం చేస్తూనే ఉంటాయి. శని గ్రహం 15 జనవరి 2023లో కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నది. మళ్లీ ఆ తర్వాత 2025 మార్చి నెలలో తన సొంత రాశిలోకి సంచారం చేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారం ప్రభావం జనవరి నుంచి 12 రాశుల వారిపై తీవ్రంగా పడబోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కుంభ రాశి సంచారం వల్ల 2023 నుంచి 2025వరకు ప్రభావం నుండి అవకాశాలు ఉన్నాయ ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలను చేకూర్చితే.. మరికొన్ని రాశుల వారికి చాలా రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ఏయే రాశుల వారు శని గ్రహ సంచార ప్రభావం వల్ల నష్టపోతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సంచారం ఈ రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది:


కుంభం: 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం కుంభరాశిలోనే రెండున్నర సంవత్సరాల పాటు ఉండబోతోంది. అయితే ఈ ప్రభావం వల్ల పలు రాశుల వారికి సాడే సతి రెండవ దశ మొదలు కాబోతోంది. ముఖ్యంగా కుంభ రాశి వారు ఈ క్రమంలో తీవ్రత ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు 23 ఫిబ్రవరి 2028న సడే సతి నుండి విముక్తి పొందుతారు. కాబట్టి అప్పటిదాకా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు మార్చి 2025 వరకు డబ్బు ఆరోగ్యం సంబంధాల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. 


మకరం: 
మకర రాశి వారికి కూడా శని సంచారం సడే సతి మూడవ దశ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.  ఈ క్రమంలో ఎలాంటి నష్టాలైనా చవిచూసే అవకాశాలున్నాయి కాబట్టి ఆర్థిక విషయాలు సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. ఈ రాశి వారికి సంచార ప్రభావం 2029 మార్చి వరకు కొనసాగుతుంది.


మీనం:
మీనరాశి లోకి శని గ్రహం ఏడున్నర సంవత్సరాల తర్వాత సంచారం చేయనుంది. దీంతో ఈ రాశి వారికి కూడా పలు కష్టాలు మొదలవుతాయి. కాబట్టి ఈ క్రమంలో వీరు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే శని దేవుని చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా దానధర్మ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. 


Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  


Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook