Shani Gochar 2022, 2023: 2023 సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా ఒక నెల మాత్రమే సమయం ఉంది. అయితే చాలామందికి వచ్చే సంవత్సరంలో జాతకాలు ఎలా ఉండబోతున్నాయని ప్రశ్న తలెత్తొచ్చు. అయితే రాబోయే కొత్త సంవత్సరంలోనే శని దేవుడు కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం ఫలితంగా అన్ని రాశుల వారికి రాజయోగ గడియలు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం క్రమంలో కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలిగే ఛాన్స్ ఉంది. ఈ సంచారం యొక్క ప్రభావం 2023 సంవత్సరంలో మూడు నెలల పాటు ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త సంవత్సరంలో రాబోయే మూడు నెలలు కూడా అన్ని రాశుల వారు మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారైతే ఈ క్రమంలో వ్యాపార రంగంలో ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్న రాశుల వారికి రెట్టింపు ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


మకర రాశి:
శని సంచారం వల్ల మకర రాశి వారికి రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు వీరికి రెండవ స్థానంలో శని సంచరించబోతున్నాడు కాబట్టి ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆకస్మిక లాభాలు కూడా పొందుతారు. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ క్రమంలో ఊహించని లాభాలు పొందుతారు. ఈ క్రమంలో మకర రాశి వారు కష్టపడి పనిచేస్తే ఫలితాలు తప్పకుండా పొందుతారు. ఈ సంచార దశలోనే వ్యాపారాలు ప్రారంభించుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.


మిధున రాశి: 
శని సంచారం వల్ల మిధున రాశి వారు కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు. వీరికి శని తొమ్మిదవ స్థానంలో ఉండబోతోంది. కాబట్టి ఈ రాశి వారు ఎలాంటి పనులు చేసినా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో అదృష్టాన్ని పొందుతారు కాబట్టి కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సంచారం ప్రభావం వల్ల వ్యాపారాలు పరంగా విజయాలు సాధించి అధిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసి వ్యాపార రంగాల్లో పెట్టుబడులు కూడా పెడతారు. మిధున రాశి వారు శని సంచారం వల్ల ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ క్రమంలో కొత్త కొత్త ప్రదేశాలను చూసే అవకాశాలు కూడా ఉన్నాయి.


వృషభ రాశి:
కుంభ రాశిలోకి శని సంసారం చేయడం వల్ల ఈ రాశి వారికి అన్ని గడియలు శుభప్రదమైనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వృషభ రాశి వారికి శని దేవుడు పదవ స్థానంలో ఉంటాడు. దీంతో వీరు కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఈ సంచారం వల్ల ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల విషయానికొస్తే సంచార దశలు ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు కూడా పొందే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సంచార క్రమంలో కష్టపడి పని చేయడం నేర్చుకోండి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారి విషయానికొస్తే.. వృషభ రాశి వారు ఈ క్రమంలో మంచి ఫలితాలు పొందుతారు.


Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?


Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook