Shani Jayanti 2022: మే 30వ తేదీన శని జయంతి ఉంది. శని జయంతి నాడు కొన్ని ఉపాయాలు, పద్ధతులు ఆచరిస్తే..శనిపీడ విరగడవుతుంది. శనిదోషం నుంచి బయటపడతారు. ఆ విధానాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని జయంతి వచ్చేస్తోంది. శని దోషం, శని పీడ నుంచి విముక్తులయ్యేందుకు ఇదే మంచి అవకాశం. మే 30వ తేదీ సోమవారం నాడు శని జయంతి ఉంది. ఆ రోజున సోమవతి అమావాస్యతో పాటు వట సావిత్రి వ్రతం కూడా ఉంది. జ్యేష్ఠ అమావాస్యనాడు సూర్య పుత్రుడు శని దేవుడు జన్మిస్తాడు. శనిదేవుడుని కర్మ ఫలదాతగా భావిస్తారు. చేసిన పనుల ఆధారంగా ప్రతిఫలం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు శని దోషం ఉంటుంది. ఫలితంగా ఆ వ్యక్తి సమస్యలకు లోనవుతాడు. అతడు చేసిన పనికి ప్రతిఫలం లభిస్తుంది. శని దృష్టి ఒక వ్యక్తిపై పడిందంటే..ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి బ్యాడ్ టైమ్ ప్రారంభమైనట్టే. అయితే శని జయంతి నాడు కొన్ని ఉపాయాలు పాటిస్తే..శని పీడ నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. 


శని జయంతి నాడు ప్రతి వ్యక్తి శని దేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం. ఈ రోజున శనిదేవుడి పూజను..అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు, షమీ ఆకులు, నల్ల నువ్వులు, ఆముదం నూనె వంటివాటితో చేయాలి. ఫలితంగా శని దోషం, శని ప్రభావం పోతుంది. 


శని జయంతి నాడు ఏదైనా శనీశ్వరాలయానికి వెళ్లి శనిదేవుడికి నమస్కరించాలి. ఓ పెద్ద దీపంలో ఆముదం నూనె వేసి..అందులో ప్రతిబింబాన్ని చూసుకుని..దానాలు చేయాలి. ఫలితంగా శని దోషం పోతుంది. శని పీడ పోవాలంటే..శని దేవుడిని ఆముదం నూనెతో  పూజలు చేయాలి. అదే నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శని ప్రభావం పోతుంది.


శని జయంతి నాడు ఆముదం నూనెలో నల్లనువ్వులు వేసి శనిదేవుడికి అర్పించాలి. లేదా ఆ నూనెలో 2 లవంగాలు వేసి శని దేవుడికి హారతి ఇవ్వాలి. శని గ్రహం కటాక్షంతో ఆ దోషం పోతుంది. శని జయంతి నాడు సాయంత్రం వేళ..రావి చెట్టు కింద నవ్వులు లేదా నూనెతో దీపం వెలిగించాలి. శనిపీడ, శనిదోషం నుంచి విముక్తులయ్యేందుకు శని బీజమంత్రం ఓం..ప్రాం..ప్రీం..ప్రౌం..సహ...శనీశ్వరాయ నమహ అంటూ జపించాలి. 


శని జయంతి నాడు శనీశ్వరుడి పూజ చేసిన తరువాత నల్ల చెప్పులు, నలుపు లేదా నీలం వస్త్రం, ధూపం, నల్ల నువ్వులు, ఇనుము, ఉక్కును ఎవరైనా పేదలకు దానం చేయాలి. ఇలా చేస్తే శని దేవుడడు ప్రసన్నమై..మీ కష్టాల్ని తొలగిస్తాడని నమ్మకం.


Also read: Mars Transit 2022: త్వరలో మేషరాశిలోకి కుజుడు... ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి