Shani Amavasya 2022 : జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు 'శని జయంతి'ని జరుపుకుంటారు. ఈసారి శని జయంతి సోమవారం (మే 30)న రానుంది. ఇదే రోజున సోమవతి అమావాస్య, వట్ సావిత్ర వ్రతం కూడా కావడం విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అరుదైన సందర్భం. దాదాపు 30 ఏళ్ల తర్వాత శని జయంతి, వట్ సావిత్రి వ్రతం, సోమవతి అమావాస్య ఒకే రోజున వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాదికి ఇదే చివరి సోమవతి అమావాస్య కావడం గమనార్హం. ఒకే రోజు శని జయంతి, సోమవతి అమావాస్య కావడం వల్ల దీని ప్రభావం ఆయా రాశుల వారిపై గట్టిగానే ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం శని దేవుడు ఆయా రాశుల వారి కర్మానుసారం ఫలాలు అందజేస్తాడు. అయితే శని దేవుడి అనుగ్రహం పొందేవారు కష్ట, నష్టాల నుంచి విముక్తి పొందగలరు. శని జయంతి రోజున ఏం చేస్తే ఆ శనీశ్వరుడి అనుగ్రహం పొందగలరో... అలాగే, సావిత్రి దేవి అనగా వేద మాత గాయత్రి అనుగ్రహం కోసం ఏవిధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం... 


వట్ సావిత్రి వ్రత పూజా విధానం :


వట్ సావిత్రి వ్రతం చేసే స్త్రీలు సూర్యాస్తమయం కన్నా ముందే నిద్రలేచి వీలైతే నదిస్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించి మర్రి చెట్టు వద్ద దీపం వెలిగించి పూజించాలి. పూజ సమయంలో మర్రి చెట్టు చుట్టూ పత్తి దారాన్ని ఐదు లేదా ఏడు రౌండ్లు చుట్టండి. వట్ సావిత్రి కథతో పాటు గాయత్రి మంత్రాన్ని పఠించండి. మర్రి పండ్లు, నాన బెట్టిన 11 పప్పులను నైవేద్యంగా సమర్పించండి. తద్వారా మీ భర్త దీర్ఘాయుష్షు పొందుతారు. ఆరోజున ఉపవాసం మరవొద్దు.


ఈ పనులు తప్పక చేయండి :


శని జయంతి రోజున నలుపు రంగు బట్టలు దానం చేయండి. నల్ల నువ్వులు, గొడుగు, స్టీల్ పాత్రలు, బూట్లు, చెప్పులు మొదలైన వాటిని దానం చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు.


శని జయంతి రోజున రావి చెట్టు వద్ద ఆవనూనె దీపం పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి జీవితం వికసిస్తుంది.


శని జయంతి రోజున రావి చెట్టును పూజించి నెయ్యి దానం ఇస్తే శుభం కలుగుతుంది.


శని జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానునికి నీటిని సమర్పించాలి. ఆ నీళ్లలో బెల్లం, బియ్యం వేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడి తండ్రి అయిన సూర్య భగవానుడి అనుగ్రహం కూడా పొందుతారు.


సోమవతి అమావాస్య రోజున పవిత్ర నది స్నానం ఆచరించి... నది ఒడ్డున దీపం వెలిగిస్తే శని దేవుడి అనుగ్రహంతో పాటు ఆ పరమ శివుడి అనుగ్రహం పొందుతారు.


శని జయంతి రోజున పేదలకు అన్న దానం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 


(గమనిక - ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ న్యూస్ దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Shani Jayanti 2022: శని జయంతి ఎప్పుడు.. శని పూజ ఎలా చేయాలి.. ఏలినాటి శని నుంచి ఎలా విముక్తి పొందాలి..


Also Read: Saturn Transit 2022: మకర రాశిలోకి శని ప్రవేశం... ఇక వచ్చే ఏడాది వరకు ఆ రాశుల వారికి శని బాధల నుంచి విముక్తి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.