Saturn Transition into Capricorn: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశిచక్రం మారిన ప్రతీసారి రాశిచక్రంలోని అన్ని రాశుల వారిపై దాని ప్రభావం ఉంటుంది. కొన్ని రాశుల వారికి అది సానుకూల ఫలితాలను కలగజేస్తే... మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను కలగజేస్తుంది. వచ్చే జూలై 12న శని మరోసారి రాశిచక్రం మారబోతున్నాడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని జూలై 12న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు శని మకర రాశిలోనే ఉంటాడు. మకర రాశిలో శని సంచారం కొన్ని రాశుల వారికి శని ప్రభావం నుంచి విముక్తి కలగనుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ రాశుల వారికి శని బాధల నుంచి విముక్తి :
శని మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటకం, వృశ్చికం, మీనం రాశుల వారు శని ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 29న శని కుంభరాశిలోకి ప్రవేశించిన సమయంలో కర్కాటక, వృశ్చిక రాశుల వారిపై నెగటివ్ ప్రభావం పడుతుంది. ఈసారి శని మకర రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఈ రెండు రాశుల వారు శని నుంచి విముక్తి పొందుతారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు వీరిపై శని ప్రభావం ఇక ఉండదు.
మీన రాశి వారికి శని మకర సంచారం కలిసొస్తుంది. ఇప్పటిదాకా వీరిని శని బాధలు వెంటాడగా... ఇకపై అన్ని బాధలు తొలగిపోతాయి.
సాధారణంగా శని దేవుడు అంటేనే అశుభానికి సంకేతంగా భావిస్తారు. కానీ శని దేవుడి అనుగ్రహం పొందగలిగితే ఎటువంటి ఆటంకాలు, కష్టాలు ఎదురవవు. ఇందుకోసం శనివారం నాడు శని పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ నెల 30న శని జయంతి రోజు శని దేవుడిని పూజిస్తే చక్కని ఫలితాలు పొందుతారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.