Dangerous yogam: ప్రమాదకరమైన యోగం చేయబోతున్న శని-కేతువు.. ఈ 3 రాశులకు బ్యాడ్ డేస్ స్టార్ట్..
Astro news in Telugu: త్వరలో శనిదేవుడు, కేతువు ప్రమాదకరమైన షడష్టక యోగం సృష్టించబోతున్నారు. దీంతో కొందరు సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shadashtak Yog 2024 effect: కర్మఫలదాత అయిన శనిదేవుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మరోవైపు దుష్ట గ్రహమైన కేతువు మీనరాశిలో కూర్చుని ఉన్నాడు. శని, కేతువుల స్థానాల ఆధారంగా అశుభకరమైన షడష్టక యోగం రూపుదిద్దుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన యోగం. ఇది కొన్ని రాశులవారిపై చెడు ప్రభావం చూపబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మీన రాశి: శని మరియు కేతువు చేస్తున్న ప్రమాదకరమైన యోగం మీనరాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ కుటుంబంలో విభేదాలు వస్తాయి. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది.
వృషభ రాశి: కేతువు, శని చేస్తున్న షడష్టక యోగం వల్ల వృషభరాశి వారి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎందులో కూడా పెట్టుబడులు పెట్టకండి, లేకపోతే మీరు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెహికల్ నడపండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది.
కుంభ రాశి: షడష్టక యోగం వల్ల మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇతరులతో గొడవలు పెట్టుకోవద్దు. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు.
Also Read: Shani Dev: కుంభరాశిలో శని కదలికలు.. ఈ రాశుల వారికి ఫిబ్రవరి 11 నుంచి పట్టిందల్లా బంగారం కాబోతోంది..
Also Read: Shani Ast 2024 Effect: లవర్స్ డే కు ముందు ఈ మూడు రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి