Shani Mahadasha 2023: జ్యోతిష్యం ప్రకారం అన్ని గ్రహాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఏదైనా జాతకం కుండలిలో ఎదైనా గ్రహం శుభస్థితిలో ఉంటే ఊహించని లాభాలు, ఫలాలు అందుతాయి. శనిగ్రహాన్ని న్యాయ దేవతగా, కర్మ ఫలదాతగా పరిగణిస్తారు. అశుభ స్థితిలో ఉంటే శని గ్రహం తీవ్ర కష్టాల పాలుజేస్తుంది. ఏదైనా జాతకం కుండలిలో శని శుభస్థితిలో ఉంటే..ఆ వ్యక్తి జాతకంలో రాజభోగం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ పంచాంగం ప్రకారం కుండలిలో యోగం బాగున్నా సరే కర్మం శుభంగా లేకపోతే ఆ శనిగ్రహం ధనహాని కల్గించవచ్చు. తీవ్ర కష్టాల్ని తెస్తుంది. వ్యక్తి జీవితంలో ప్రతి రంగంలో శని ప్రబావం పడుతుంది. దీనివల్ల ఆర్ధిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, బందాలు వంటవాటిపై ప్రబావం కన్పిస్తుంది. అసలు శని మహాదశ అంటే ఏంటి..


శని మహాదశలో కలిగే లాభాలు


ఎవరైనా వ్యక్తి కుండలిలో శని పటిష్టమైన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి చేసిన పనులు కూడా మంచి పనులైతే ఆ వ్యక్తికి శని మహాదశలో రాజులా భోగాలు, సుఖం గౌరవం అందుతాయి. ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తి అత్యంత ధనికుడిగా మారిపోతాడు. అంతులేని ప్రాచుర్యం, ఉన్నత పదవులు లభిస్తాయి. సులభంగా విభిన్న మార్గాల్నించి డబ్బులు సంపాదిస్తారు.


అదే కుండలిలో శని అధమ స్థాయికి లేదా బలహీనంగా ఉండి, ఆ వ్యక్తి చెడు పనులు చేస్తే శని మహాదశలో తీవ్ర ఇబ్బందులపాలవుతాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తికి ఊహించని ధనహాని కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడుతాయి. నలువైపుల్నించి వ్యాధులు చుట్టుముడతాయి. వ్యక్తి జీవితంలో కష్టాలు, సమస్యలు వెంటాడుతాయి


శని మహాదశలో చేయాల్సిన ఉపాయాలు


శని మహాదశ సందర్భంగా కొన్ని విషయాల్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. పండితుని సలహా లేకుండా నీలం ధరించరాదు. ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించవద్దు. మత్తుకు దూరంగా ఉండాలి. మద్యం ముట్టకూడదు. మహిళలు, వృద్ధులు, నిస్సహాయులు, కూలీలను పొరపాటున కూడా అవమానించవద్దు. లేకపోతే శని ఆగ్రహానికి గురి కావల్సివస్తుంది.


శని గ్రహం శుభఫలాల్ని అందుకునేందుకు శనివారం నాడు రావిచెట్టు కింద ఆవాల నూనెతో చతుర్ముఖ దీపం వెలిగించాలి. ఆ తరువాత 3 పెద్ద వృక్షాల చుట్టూ తిరగాలి. తరువాత శనిదేవుడి మంత్రం ఓ ప్రాం ప్రీం ప్రౌం సహం శనీశ్వరాయ నమహ జపించాలి. పేదలకు, ఆపన్నులకు సహాయం చేయాలి.


శని మహాదశ సందర్భంగా కెరీర్, వ్యాపారం రంగాల్లో అభివృద్ధి కావాలంటే శనివారం నాడు సూర్యోదయం కంటే ముందు రావిచెట్టుకి నీరు పోయాలి. ఆ తరువాత సాయంత్రం సమయంలో అదే చెట్టు కింద ఏకముఖ దీపం వెలిగించాలి. ఆ తరువాత శని చాలీసా పఠించాలి. 


Also read: Solar Eclipse 2023: ఏడాది తొలి సూర్య గ్రహణం ఎప్పుడు, ఆ 4 రాశులకు తీవ్ర కష్టాలు తప్పవా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook