Shani Mahadasha Remedy: శని మహాదశతో 19 సంవత్సరాలు కష్టాలే.. ఈ పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారమే!
19 years Shani Mahadasha Remedy. శని మహాదశి యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఈ రోజు తెలుసుకుందాం.
Do these simple remedies Gets rid of 19 years Shani Mahadasha: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. ఓ వ్యక్తి జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉంటే.. దాని కారణంగా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా శని గ్రహం వ్యక్తి జాతకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి వ్యక్తి జాతకంలో శని స్థానం భిన్నంగా ఉంటుంది. దాంతో ఒక వ్యక్తి తన కర్మలను బట్టి శని ప్రభావాలను అనుభవించవలసి ఉంటుంది. ఓ వ్యక్తికి ఎప్పుడూ చెడు జరుగుతుందంటే వారిపై శని తాండవిస్తునట్లే. శని మహాదశ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది చాలా పరిహారాలు చేస్తారు.
శని మహాదశి గురించి మనమందరం చదవడమో లేదా వినే ఉంటాం. అయితే శని మహాదశి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చాలామందికి తెలియదు. శని యొక్క మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో ఒక వ్యక్తికి శని యొక్క అశుభ ఫలితాలు అనుభవిస్తాడు. దాంతో ఆ వ్యక్తికి ఏదీ కలిసిరాదు. ఏ పని చేసినా ఆటంకాలే ఎదురవుతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి యొక్క జాతకంలో శని అశుభకరమైన ఇంట్లో ఉంటే.. అతను ధన నష్టానికి గురవుతాడు. శని నీచస్థానంలో ఉన్నా లేక సూర్యునితో కలిసి ఉన్నా.. ఆర్థికపరమైన అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో ఎప్పుడూ కలహాలే ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని మహాదశి యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఈ రోజు తెలుసుకుందాం.
శని మహాదశ అశుభ ప్రభావాలను తొలగించే పరిహారాలు:
# ఒక వ్యక్తి జాతకంలో శని యొక్క మహాదశ సాడే సతి లేదా ధైయ్యం జరుగుతూ ఉంటే.. అతను శని యొక్క దుష్ప్రభావాలతో బాధపడుతున్నట్లే. ఆ వ్యక్తి శనివారం రోజున పీపాల్ చెట్టు క్రింద ఆవాల నూనెతో నాలుగు ముఖాల (చతుర్ముఖ దీపం) దీపాన్ని వెలిగించాలి.
# చతుర్ముఖ దీపం వెలిగించిన తర్వాత పీపుల్ చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.
# ఆపై శని దేవుడి తాంత్రిక మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి.
# చివరగా పేదలకు నాణేలను విరాళంగా ఇవ్వాలి.
పై పరిహారాలు చేస్తే.. శని దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శని యొక్క మహాదశ నుండి సదరు వ్యక్తి విముక్తి పొందుతాడు. ఆపై ఆ వ్యక్తికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.
Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం! పుట్టినరోజు నాడే మృత్యుఒడిలోకి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.