Shani Margi In October 2022: జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని అత్యంత క్రూరమైన గ్రహంగా భావిస్తారు. శని దేవుడిని న్యాయ దేవుడు, కర్మ దాత అని పిలుస్తారు. మనిషి చేసే మంచి చెడులను బట్టి వారికి ఫలితాలను ఇస్తాడు శని. ఎవరి జాతకంలో అయితే శని శుభ స్ధానంలో ఉంటాడో ఆ వ్యక్తి లైఫ్ సూపర్ గా ఉంటుంది.  ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్న శని... అక్టోబర్ 23న అదే రాశిలో సంచరించబోతోంది. మకరరాశిలో శని సంచారం (Shani Margi 2022) వల్ల కొన్ని రాశుల్లో మహాపురుష రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఆ రాశులకు అపారమైన ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries)- మేష రాశి నుంచి పదో ఇంట్లో మకరరాశిలో శని సంచారం జరుగబోతుంది. ఇది వ్యాపార, ఉద్యోగ స్థలంగా భావిస్తారు.  కాబట్టి ఈ కాలంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. కొత్త జాబ్ ఆఫర్ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది.  మీరు ఆఫీసులో ప్రశంసలు అందుకోవచ్చు. ఈ సమయంలో టైగర్ స్టోన్ ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


మీనం (Pisces)- ఈ రాశిచక్రం యొక్క సంచార జాతకంలో శని 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఇది ఆదాయం మరియు లాభం యొక్క ఇల్లుగా పరిగణించబడుతుంది. శని మార్గం వల్ల ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తద్వారా భవిష్యత్తులో భారీగా లాభపడతారు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. షేర్లు లేదా లాటరీ మొదలైన వాటి నుండి లాభం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. బంగారు రత్నం ధరిస్తే మంచిది.  


ధనుస్సు (Sagittarius)- . శని ఈ రాశి యెుక్క రెండో స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది సంపద మరియు ప్రసంగం యొక్క ప్రదేశంగా భావిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశివారు మణి రత్నాలను ధరించడం మంచిది. 


Also Read: Surya Gochar 2022: కన్యారాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అఖండ ఐశ్వర్యం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook