Shanidev Margi 2022: ధంతేరాస్ రోజు శనిదేవుడి కదలిక... ఈ 4 రాశులవారి కెరీర్ కేక..
Shanidev Margi 2022: ధంతేరాస్ రోజున శనిదేవుడు తిరోగమనం నుండి మార్గంలోకి రానున్నాడు. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Shanidev Margi 2022: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయ దేవుడు అంటారు. మనిషి మంచి పనులు చేస్తే శనిదేవుడు శుభ ఫలితాలను ఇస్తాడు, చెడు పనులు చేస్తే శిక్షిస్తాడు. శనిగ్రహం ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉంది. అక్టోబరు 23 నుండి నేరుగా నడవటం మెుదలుపెడుతుంది. ధంతేరాస్ రోజున అంటే అక్టోబరు 23న ఉదయం 4:19 గంటలకు మకరరాశిలో శనిదేవుడు (Shani Dev) ప్రత్యక్షంగా సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడి మార్గం అన్ని రాశుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. శని యొక్క ఈ కదలిక కొందరికి శుభప్రదంగా, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. శని మార్గి సమయంలో ఏయే రాశుల వారు అదృష్టం ప్రకాశించనుందో తెలుసుకుందాం.
శని ప్రత్యక్ష సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి (Aries): శని దేవుడి మార్గం మేషరాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్‌లో విజయం సాధిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు.
తులారాశి (Libra): ఈ సమయం తుల రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. పాత వివాదాలు పరిష్కారమవుతాయి. మెుత్తంగా ఈ సమయం ఈరాశివారికి బాగుంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి ప్రజలు కూడా శని దేవుడి మార్గం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. మీరు ప్రేమ విషయాలలో విజయం సాధిస్తారు. బ్రహ్మచారుల వివాహానికి అవకాశం ఉంటుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.
మీనరాశి (Pisces): మీన రాశి వారికి శని దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీరు చేపట్టే ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. వ్యాపారులు బిజినెస్ ను విస్తరిస్తారు.
Also Read: Surya Gochar 2022: అక్టోబరు 17న తులరాశిలోకి సూర్యుడు... నెల రోజులపాటు ఈరాశులవారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook