Dhanteras Shani Margi 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం సంచరించినప్పుడల్లా.. దాని శుభ మరియు అశుభ ప్రభావాలు అన్ని రాశులవారిపై ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, శని గ్రహాన్ని క్రూరమైన గ్రహంగా భావిస్తారు.  శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అదే శనివక్ర దృష్టి ఎవరిపైనైనా పడిదంటే ఆ వ్యక్తి నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. మనం చేసే కర్మల ప్రకారం ఫలాలను ఇచ్చే దేవుడు శని. ప్రస్తుతం శనిగ్రహం మకరరాశిలో తిరోగమనంలో ఉంది. రేపు అంటే అక్టోబరు 23న మార్గంలోకి (Shani Margi 2022) రానుంది. శనిదేవుడి ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారు భారీ ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని ప్రత్యక్ష సంచారం ఈ రాశులకు శుభప్రదం
మీనం (Pisces): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి యెుక్క పన్నెండవ ఇంటికి శనిదేవుడు అధిపతి. ఈ సమయంలో లా చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. కష్టానికి తగ్గ ఫలితాలను అందుకుంటారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు (Sagittarius): అక్టోబర్ 23న శని నేరుగా నడవనున్నాడు. దీంతో ఈ రాశివారి లైఫ్ లో ఆనందం వెల్లివిరిస్తుంది. ధనలాభం ఉంటుంది. మీ అప్పులు తీరిపోతాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ప్రేమ వివాహాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. 


కర్కాటకం (Cancer): ఈ రాశి యెుక్క ఏడో ఇంటికి శని అధిపతి. దీంతో ఈ రాశివారు త్వరలోనే ధనవంతులు అవుతారు. వీరి జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సపోర్టు మీకు లభిస్తుంది.  
మిథునం (Gemini): ఈ రాశి వారికి శని అనుగ్రహం ఉంటుంది. వీరికి ఊహించనంత ధనలాభం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. 
మేషం (Aries): అక్టోబర్ 23 ధన్తేరస్ రోజున శని మార్గంలో ఉంటుంది. జనవరి 17, 2023 వరకు అదే స్థితిలో ఉంటాడు. దీంతో మేషరాశివారు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. మీరు ఏరంగంలో అడుగుపెడతారో అందులో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. 


Also Read: Shani pradosh vrat 2022: శని ప్రదోష వ్రతం ఎప్పుడు? శని దేవుడి చెడు ప్రభావాలను తగ్గించాలంటే ఏం చేయాలి? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook