Shani Nakshatra Gochar: శని నక్షత్ర మార్పు.. 2024లో ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
Shani Gochar 2024: కొత్త సంవత్సరంలో శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. ప్రస్తుతం ఉన్న నక్షత్రాన్ని వదిలి పూర్వాభాద్రపద నక్షత్రంలోకి వెళ్లనున్నాడు. దీని కారణంగా కొందరి అదృష్టం మారబోతుంది.
2024 Shani Nakshatra Gochar: మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. ఈ కొత్త ఏడాదిలో గ్రహాలు కూడా కొత్త రాశుల్లోకి ప్రవేశించబోతున్నాయి. శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తూనే.. ఏప్రిల్ 06న పూర్వాభాద్రపద నక్షత్రంలోకి వెళ్తాడు. పూర్వాభాద్రపద నక్షత్రంలో శని సంచారం వల్ల కొందరినీ అదృష్టం వరించనుంది. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు బిలియనీర్ అయిపోతాడన్న సంగతి మనకు తెలిసిందే. మరి శని నక్షత్ర మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
వృషభం: శని యెుక్క నక్షత్ర మార్పు వృషభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీ ఆదాయంలో ఊహించని విధంగా పెరుగుతుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు కోరుకున్న జాబ్ వస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. అప్పుల భారం నుండి బయటపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది.
కన్య: నూతన సంవత్సరంలో కన్యా రాశి వారికి కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ చెప్తాడు శనిదేవుడు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు.
మేషం: పూర్వాభాద్రపద నక్షత్రంలో శని సంచారం మేష రాశి వారికి మేలు చేస్తుంది. 2024లో మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు కొత్త ఇల్లు, కారు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా ఎదురచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook