Shani Reverse Move 2022: శని గ్రహ తిరోగమన దశ రాబోయే జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 29న శని మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు కుంభ రాశి నుంచే శని తిరోగమన దశ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జూన్ 5 నుంచి అక్టోబర్ 23 వరకు శని తిరోగమన దశ ఉంటుంది. మొత్తం 141 రోజుల పాటు శని తిరోగమన దిశలో కదులుతుంటాడు. శని తిరోగమనం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుంది. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి కీడు చేస్తుంది. శని తిరోగమన ఫలితాలు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని తిరోగమనంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి :


మేషం: మేష రాశి వారికి శని తిరోగమనం కారణంగా ధన నష్టం కలగవచ్చు. పెట్టిన పెట్టుబడి లాభదాయకంగా ఉండకపోవచ్చు. లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. శని తిరోగమన దశలో మేష రాశి వారు ఆర్థికపరమైన అంశాల్లో ఆచీ తూచీ వ్యవహరించడం మంచిది. శని తిరోగమన దశ మేష రాశి వారి వైవాహిక బంధంపై కూడా చెడు ప్రభావం చూపవచ్చు.


కర్కాటకం : శనిగ్రహం తిరోగమనం కారణంగా కర్కాటక రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 141 రోజుల్లో మీ ఆర్థిక స్థితిగతులపై దాని ప్రభావం ఉండొచ్చు. శని తిరోగమనంలో ఉండటం వల్ల మీరు చేపట్టే అన్ని పనులపై దాని నెగటివ్ ప్రభావం ఉంటుంది.


మకరం: మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని తిరోగమన కదలిక కారణంగా మీరు మీ కెరీర్‌లో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. మీ మాటలు, కోపాన్ని నియంత్రించుకోండి. అనవసర విషయాలపై చర్చలు చేయకండి. ధన నష్టం మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ బాస్ లేదా అధికారులతో సంబంధాలు చెడే అవకాశం ఉంటుంది.


కుంభం: శని కుంభ రాశిలోనే తిరోగమన దశలో ఉండనున్నాడు. తిరోగమన దశ కారణంగా శని రాశి వారికి వివాహ విషయంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఏ పరిస్థితుల్లోనైనా సంయమనంతో, ఓపికతో ముందుకు సాగితే చెడును అధిగమించవచ్చు. డబ్బు ఖర్చు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.


Also Read: IPL Eliminator Match: లక్నోపై బెంగళూరు విక్టరీ... 14 పరుగుల తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్..  


Also Read: Somuveerraju Comments: ఏపీలో కోనసీమ ఘటనపై పొలిటికల్ వార్..సోమువీర్రాజు ఏమన్నారంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి