Shatru Grah Yuti 2023: జనవరి 17 శనిదేవుడు, ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభరాశిలో సంచరించారు. సూర్యభగవానుడు మార్చి 15 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. ఇదే రాశిలో శని మరియు సూర్యదేవుడు కలయిక ఏర్పడింది. ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ తండ్రీ కొడకులకు అస్సలు పడదు. అయితే వీరిద్దరి కలయిక వల్ల మూడు రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు. వీరు మార్చి 15వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని-సూర్యుడు సంయోగం ఈ రాశులకు నష్టం
కర్కాటకం - సూర్య-శని మైత్రి కర్కాటక రాశి వారికి అంతగా కలిసిరాదు. ఈసమయంలో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకుంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. పోటీపరీక్షల్లో మీకు ఆశించిన ఫలితాలు లభించవు. కోర్టు కేసుల్లో ఓడిపోతారు. 
మకరం- సూర్యుడు-శని సంయోగం మకరరాశి వారికి సమస్యలను కలిగిస్తుంది. మీపై శనిసడేసతి కొనసాగడం వల్ల మీకు కష్టాలు ఎక్కువ అవుతాయి. మీకు ధన నష్టం కలగవచ్చు. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. 
కుంభం - సూర్యుడు మరియు శని కలయిక వల్ల కుంభ రాశి వారికి మార్చి 15 వరకు ఇబ్బంది కలుగుతుంది. మీ పని చెడిపోయే అవకాశం ఉంది. ఈసమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. అంతేకాకుండా డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితంలో సమస్యలు రావచ్చు. 


ఈ పరిహారం చేయండి
సూర్యుడు-శని అశుభ ప్రభావాలను తగ్గించానికి మార్చి 15 వరకు ప్రతిరోజూ ఉదయాన్నే ఉదయించే సూర్యుడికి ప్రార్థనలు చేయాలి. అలాగే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండి ఉప్పు లేని ఆహారం తినండి. ఆదిత్య హృదయ స్త్రోతం పఠించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. సూర్యుడు కూడా తండ్రికి కారకుడు, కాబట్టి తండ్రిని గౌరవించండి. మరోవైపు శనివారం శని ఆలయంలో ఆవనూనె దీపం వెలిగించండి. అవసరమైన వారికి నల్ల వస్తువులను దానం చేయండి.


Also Read: Mercury Set 2023: కుంభంలో బుధుడి అస్తమయం.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.