Shani Transit 2022: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశీచక్రంలో శని ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. పురాణాలు, గ్రంధాలలో.. సూర్యదేవుని కుమారుడు శని అని, ఆయన కర్మ దాత అని పిలుస్తారు. కలియుగంలో మానవుల కర్మల లెక్కలు శని మాత్రమే చేస్తాడని నమ్మకం. శనిదేవునికి ప్రజలు భయపడటానికి కారణం ఇదే. అయితే శనిదేవుడు ఎప్పుడూ చెడు ప్రభావాన్ని చూపేవాడు కాదు. కానీ, రాశీచక్రంలోని కొన్ని రాశులకు మాత్రమే శని ప్రవేశం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు శనిదేవుని వల్ల ప్రభావితమయ్యే రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి


శనికి అంగారక గ్రహంతో శత్రుత్వం ఉంది. మేషరాశికి అంగారకుడిని అధిపతిగా భావిస్తారు. అయితే శనికి, అంగారక గ్రహానికి పెద్దగా కలిసిరాదు. ఈ క్రమంలో మేషరాశి వారి జాతకం ప్రకారం శని మహర్దశ ప్రారంభమైనప్పుడు వారి జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. దీని వల్ల ధన నష్టం కలగడమే కాకుండా పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. 


కర్కాటక రాశి


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని వల్ల కర్కాటక రాశి వారికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాశికి చంద్రుడు అధిపతి అని చెబుతారు. శని దేవుడికి చంద్రునితో శత్రుత్వం ఉంది. ఒక జాతకంలో శని, చంద్రుడు కలయికలో ఉన్నప్పుడు అనేక కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. అదే విధంగా మానసిక ఇబ్బందులు, తెలియని భయం ఏర్పడే అవకాశం ఉంది. 


సింహ రాశి


రాశిచక్రం ప్రకారం.. సింహరాశిని 5వ రాశిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు గ్రహాలకు అధిపతి అని చెబుతారు. కానీ.. శని, సూర్యుడులను శత్రువులుగా భావిస్తారు. అయితే శని సూర్యుని కుమారుడు. కానీ, శని తన తండ్రి సూర్యుడ్ని ద్వేషిస్తాడని పురణాలు చెబుతున్నాయి. దీని వల్ల సింహరాశి వారికి ప్రత్యేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 


Also Read: Guru Gochar 2022: గురుగ్రహ సంచారం వల్ల ఈ 3 రాశులకు శుభకాలం!


Also Read: Surya Gochar 2022: సూర్యుని సంచారం కారణంగా రాశీచక్రంలో కలిగే మార్పులు ఏవో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.