Shani Transit Effect April 2022: శని గ్రహ గోచారానికి సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇది. ఇక శని గ్రహానికి ధనురాశికి సంబంధాలు కట్. శని గోచారానికి సంబంధించిన కీలకమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో రెండ్రోజుల్లో అంటే ఏప్రిల్ 29, 2022 న శని గ్రహం కుంభరాశిలో ప్రవేశిస్తుంది. ఫలితంగా ధనస్సు రాశివారి కష్టాలు తొలగిపోయి..మీన రాశివారికి నష్టజాతకం ప్రారంభం కానుంది. అటు మిధున, తుల రాశులవారికి కూడా కష్టాలు సమాప్తమౌతాయి. మరోవైపు కర్కాటకం, వృశ్చిక రాశులవారికి  కష్టాలు ప్రారంభం కానున్నాయి.


శనిదేవుడు తన మకర రాశిని వదిలి..కుంభరాశిలోకి ఏప్రిల్ 29న ప్రవేశించనున్నాడు. దీనివల్ల ధనస్సు రాశివారికి ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ధనస్సు రాశివారికి శని ప్రభావం తొలగిపోతుంది. గత కొద్దికాలంగా ధనస్సు రాశివారికి శని గ్రహం కారణంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు కుంభరాశిలోకి శని ప్రవేశించడంతోనే మీనరాశిపై శని ప్రభావం ప్రారంభమవుతుంది. మిధునం, తుల రాశులవారికి శని దుష్ఫ్రభావం తొలగి..కర్కాటకం, వృశ్చిక రాశులవారికి ప్రారంభమౌతుంది. 


జూలై 12 నుంచి శనిదేవుడు వక్రమార్గాన తిరిగొస్తూ..మకర రాశిలో తిరిగి ప్రవేశిస్తాడు. శనిరాకతో పాత స్థితికి మళ్లీ వచ్చేస్తుంది. ఆ తరువాత ఫిబ్రవరి 17, 2023న మకరం నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తుంది. అప్పుడు ధనస్సురాశివారికి పాత శని ప్రభావం తొలగిపోతుంది. అటు మకర రాశివారికి కష్టాలు ప్రారంభమై..కుంభరాశివారికి శని ప్రభావం పీక్స్‌కు చేరుతుంది. 


శని గ్రహం ఎలా పయనించనుంది


శని గ్రహం మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించనుంది. ఏప్రిల్ 29, 2022 ఉదయం 7 గంటల 53 నిమిషాలకు ప్రవేశించనుంది. శని ధనిష్ట నక్షత్రంలో తిరగనుంది. మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించే సందర్బంలో ధనిష్ట నక్షత్రమే ఉంటుంది. కేవలం నక్షత్రం మూడవ దశ ప్రారంభం కానుంది. జూన్ 4న కుంభరాశిలో వక్రమార్గంలో వచ్చి..తిరిగి మకరరాశివైపుకు వస్తుంది. ఆ తరువాత జూలై 12న కుంభరాశిని దాటి..మకరరాశిలో తిరిగి ప్రవేశిస్తుంది. ఇక అక్టోబర్ 22, 2022న మకరరాశిలో వెళ్తుంది. జనవరి 17న తిరిగి కుంభరాశిలో ప్రవేశిస్తుంది.


Also read: Solar Eclipse April 2022: సూర్యగ్రహణం రోజున చేయాల్సినవి, చేయకూడని పనులేంటి?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.