Solar Eclipse April 2022: సౌర కుటుంబంలోని భూమితో పాటు అనేక గ్రహాలు.. సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో అప్పుడప్పుడు సూర్యునికి భూమికి అడ్డుగా కొన్ని గ్రహాలు వస్తుంటాయి. అలా సూర్యునికి భూమికి మధ్య ఏదైనా గ్రహం అడ్డుగా ఉన్న సమయాన్ని గ్రహణ సమయం అని అంటారు. మన వరకు సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈ ఏడాది తొలిసారి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది ఏప్రిల్ 30 (శనివారం) సంభవించనుంది.
అశుభమైన గ్రహాణాలు..
జోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాలు అశుభమైనవిగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తి పెరుగుతుందని తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 30న ఏర్పడనున్న సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ, ఈ గ్రహణం రాశీచక్రంలోని జీవితాలను ప్రభావితం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సూర్య గ్రహణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 30న దక్షిణ / పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికా వంటి మొదలగు దేశాల్లో ఈ సూర్య గ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 12.15 నుంచి ఉదయం 04.07 గంటల వరకు కొనసాగుతోంది.
గ్రహణం తర్వాత ఈ పని చేయండి!
1) సూర్య గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి మూలల్లో గంగాజలాన్ని చల్లుతూ శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా గ్రహణ సమయంలో వెలువడే హానికరమైన కిరణాల ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది.
2) గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయాలి. పుణ్యనదుల్లో స్నానం చేస్తే మరింత మేలు. అది సాధ్యం కాకపోతే.. స్నానపు నీటిలో పవిత్ర నదులు నీటిని కలిపి స్నానం చేయాలి.
3) వీలైతే గ్రహణం తర్వాత దానం చేయాలి. దాని ద్వారా చెడు ప్రభావాల నుంచి రక్షణ కలుగుతుంది. అదే విధంగా ఆవుకు పచ్చి మేత తినిపించడం కూడా శ్రేయస్కరం.
(నోట్: పైన పొందుపరిచిన సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడి సలహా తీసుకోవడం మేలు. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Panchak: నేటి నుంచి రాజ్ పంచకము.. అసలేంటి పంచకము.. దీని ప్రభావం ఎలా ఉంటుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.