Shani Vakri In July 2022: జూలైలో కొన్ని పెద్ద గ్రహాలు తమ రాశిచక్రాన్ని మార్చబోతున్నాయి. అందులో శని కూడా ఒకటి. జూలై 12న శని గ్రహం తన సొంత రాశి అయిన మకరరాశిలో తిరోగమనం (Saturn transit in Capricron 2022) చేయనుంది. అక్కడే జనవరి 17, 2023 వరకు ఉండనుంది. ప్రస్తుతం కుంభరాశిలో శని తిరోగమనంలో ఉంది. మరో వారం రోజుల్లో శని రాశిని మారడం వల్ల 2 రాశులు శని ఆగ్రహానికి గురవుతాయి. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని తన స్థానాన్ని మార్చిన వెంటనే దాని శుభ, అశుభ ప్రభావాలు అన్ని రాశులపై కనిపిస్తాయి. శని మకరరాశిలో ప్రవేశించిన వెంటనే మిథున, తులారాశి వారికి శని మహాదశ పట్టనుంది. ఈ రెండు రాశుల వారిపై జనవరి 17 వరకు శనిగ్రహం చెడు దృష్టి ఉంటుంది. 


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఏప్రిల్ 29న కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు కర్కాటక, వృశ్చిక రాశి వారికి శని ధైయా మెుదలయింది. అయితే జూలై 12న శని మకరరాశిలోకి వెళ్లినప్పుడు ఈ రెండు రాశుల వారికి మరోసారి శని మహాదశ తొలగిపోతుంది. మళ్లీ జనవరి 17, 2023 నుంచి వీరికి శని దైయా పట్టనుంది. 


శని మహాదశ పరిహారాలు


శని ధైయా వల్ల మనిషి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వ్యక్తి ఏ పని తలపెట్టిన అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని చెడు దృష్టిని నివారించాలంటే వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయండి. చీమలకు పిండిని వేయండి. శనివారం శని దేవుడికి ఆవాల నూనె సమర్పించండి. సుందరకాండను కూడా పఠించండి. 


Also Read: Guru Vakri 2022: గురు తిరోగమనం.. ఈ రాశులవారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook