Shani Uday on 06th March 2023: జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయ దేవుడిగా భావిస్తారు. అందుకే శనిదేవుడి అంటే అందరూ భయపడతారు. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు అదే రాశిలో అస్తమించాడు. మళ్లీ శని హోలీకి రెండు రోజులు ముందు అంటే మార్చి 6న ఉదయించనున్నాడు. కుంభరాశిలో శనిదేవుడు ఉదయం వల్ల కొన్ని రాశులవారి జీవితాలు ప్రకాశించనున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి ఉదయం ఈ రాశులకు శుభప్రదం


సింహ రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సింహ రాశికి అధిపతి సూర్యుడు మరియు శని దేవుడి యెుక్క తండ్రి. దీని కారణంగా శనిదేవుడి ఉదయించగానే ఈ రాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి పనులు చేస్తే మీపై శని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. రుణవిముక్తి నుండి బయటపడతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. 


తుల రాశి: తుల రాశికి అధిపతి శుక్రుడు మరియు ఇది శని యొక్క స్నేహ గ్రహం. కావున శని ఉదయించడం వల్ల తుల రాశి వారి జీవితాల్లో మార్పు వస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


వృషభం : శని ఉదయించడం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా కష్టపడి పనిచేసేవారు మంచి ఫలితాలను పొందుతారు. లక్ కలిసి వస్తుంది. మీ డబ్బులో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.


కుంభం: కుంభ రాశికి అధిపతి శని. ఇదే రాశిలో శని అస్తమించింది. మళ్లీ ఇందులోనే ఉదయిస్తుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు భారీగా ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Malavya Rajyog: మరో 48 గంటల్లో ఈ రాశుల ప్యూచర్ మారనుంది... ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook