Margi Budh Effects: జూన్ నెల 2 ప్రధాన మార్పులతో ప్రారంభమైంది. జూన్ 2022 మొదటి వారంలో, శని మరియు మెర్క్యురీ వంటి 2 ముఖ్యమైన గ్రహాల కదలిక (Planet Transit 2022) మారింది. జూన్ 3న బుధుడు వృషభరాశిలో తిరోగమనం చెందగా... జూన్ 5న శని కుంభరాశిలో తిరోగమనం చెందాడు. శని మరియు మెర్క్యురీల మారిన కదలిక అన్ని రాశిచక్ర ప్రజలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఒక నెల వరకు బుధుడు (Budh Margi 2022) అదే స్థితిలోనూ.. అక్టోబర్ వరకు శని తిరోగమనంలో (Shani Vakri 2022) ఉంటుంది. ఈ రెండు గ్రహాల కదలికలు 4 రాశుల వారికి అదృష్టాన్ని ప్రకాశింపజేయబోతున్నాయి. అవేంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries)- శని, బుధ గ్రహాల గమనం మేషరాశి వారికి అనుకూలం. ఈ వ్యక్తులు ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. కొందరికి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ రావచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇంటిని, నూతన కారును కొనుగోలు చేయవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. 


వృషభం (Taurus)- బుధుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారికి చాలా శుభప్రదం. కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్-ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూసే వారే కోరిక తీరుతుంది. తగినంత డబ్బు చేతికి అందుతుంది. పార్టనర్  షిప్ తో పనుల చేయడం వల్ల లాభాలు పెరుగుతాయి. వీరు డబ్బు ఆదా చేస్తారు. 


మిథునరాశి (Gemini)- శని మరియు బుధ గ్రహాల సంచారంలో మార్పు మిథున రాశి వారికి నిలిచిపోయిన పని ప్రారంభమయ్యేలా చేస్తోంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. యాత్రకు వెళ్ళవచ్చు. వ్యాపారస్తులు బాగా రాణిస్తారు. లాభాలు పెరుగుతాయి. 


ధనుస్సు (Sagittarius)- బుధుడి కదలిక మరియు తిరోగమన శని ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన ప్రమోషన్ ఇప్పుడు దొరుకుతుంది. పనిలో విజయం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారు విజయం సాధించగలరు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీరు కొత్త మార్గాల నుండి డబ్బు పొందుతారు.


Also Read: Vastu Dosh Remedies for Home: ఇంటి వాస్తు దోషాలకు చెక్ పెట్టే సులభమైన మార్గాలు ఇవిగో..! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook