Shanichar Amavasya 2023 Remedies: జనవరి 21న శనీచర అమావాస్య.. ఆర్ధిక ఇబ్బందులు తొలగేందుకు ఏం చేయాలంటే.. ??
Shanichar Amavasya 2023 Remedies: మౌనీ అమావాస్య ఈ ఏడాది శనివారం నాడు అంటే జనవరి 21 న వస్తోంది. ఆ రోజున కొన్ని ఉపాయాలు ఆచరిస్తే ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. శని అమావాస్య నాడు ఎలాంటి ఉపాయాలు ఆచరించాలి, పూజా ముహూర్తం ఎప్పుడనేది తెలుసుకుందాం..
Shanichar Amavasya 2023: హిందూమతంలో మౌనీ అమావాస్య, శనీచర అమావాస్యకు అత్యంత మహత్యముంది. ఈ ఏడాది మాఘమాసపు మౌనీ అమావాస్య శనివారం నాడు రావడంతో అన్ని రకాలుగా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ శని అమావాస్య పూజా ముహూర్తం ఎప్పుడు, ఏం చేయాలి..
మౌనీ అమావాస్య 21 జనవరి 2023న శనివారం నాడు ఉంది. ఇటీవలే శని గ్రహ గోచారం జరిగింది. శని తన మూల త్రికోణ రాశి కుంభంలో ప్రవేశించింది. దాంతో శనీచర అమావాస్య..శని కటాక్షం పొందడానికి చాలా రకాల సమస్యల్నించి విముక్తి పొందేందుకు ప్రత్యేకంగా మారింది.
శనీచర అమావాస్య పూజా ముహూర్తం ఎప్పుడు
మాఘ మాసపు కృష్ణ పక్షం అమావాస్య తిధి జనవరి 21, శనివారం ఉదయం 6.17 గంటల నుంచి ప్రారంభమై..జనవరి 22, ఆదివారం తెల్లవారుజామున 2.22 గంటల వరకూ ఉంటుంది. ఉదయతిధి ప్రకారం మౌనీ అమావాస్య లేదా శనీచర అమావాస్య జనవరి 21నే ఉంటుంది. మౌనీ అమావాస్య రోజు స్నానదానాలు, తర్పణం, పూజాది కార్యక్రమాలు తప్పకుండా ఆచరించాలి.
గంగా స్నానంతో లభించే అమృత స్నానపు పుణ్యం
మౌనీ అమావాస్య లేదా శనీచర అమావాస్య రోజు గంగాస్నానం చేయడం చాలా మహత్యమైంది. ఈ రోజున గంగాస్నానం చేయడం వల్ల అమృతస్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ప్రత్యేకించి ఎవరిపై అయితే శని మహాదశ నడుస్తుందో..వారు ఆ రోజు గంగాస్నానం సహా కొన్ని ప్రత్యేక ఉపాయాలు తప్పకుండా పాటించాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి కటాక్షం లభిస్తుంది. అన్ని కష్టాలు దూరమౌతాయి. శనీచర అమావాస్య నాడు శనిని ప్రసన్నం చేసుకునేందుకు ఏ ఉపాయాలు ఆచరించాలో తెలుసుకుందాం...
శనీచర అమావాస్య రోజు స్నానం చేసి దానాలు చేయాలి. ఇలా చేయడం వల్ల అంతులేని సుఖ సమృద్ధి లభిస్తుంది. పితృదోషానికి బలైనవారు..శనీచర అమావాస్య నాడు తమ పూర్వీకుల ఆత్మశాంతికి శార్దం, తర్పణం వదలాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో సుఖ సమృద్ధి, అభివృద్ధి, శాంతి లభిస్తాయి. ఒకవేళ పవిత్ర నదిలో స్నానం చేయలేకపోతే..ఇంట్లోనే బియ్యం పాయసం చేసి భోగం వేయాలి. శనీచర అమావాస్య నాడు రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించాలి. శని కటాక్షం పొందేందుకు ఆర్ధిక ఇబ్బందుల్నించి దూరమయ్యేందుకు వీలవుతుంది. అంతేకాకుండా పదోన్నతిలో ఎదురయ్యే ఆటంకాలు దూరమౌతాయి.
Also read: Shani Amavasya 2023: శని అమావాస్య నాడు ఈ ఉపాయాలు ఆచరిస్తే..మీ దారిద్య్రం వదిలిపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి