Shani Sade Sati Remedies: ఆస్ట్రాలజీ ప్రకారం, శని యొక్క సడే సతి ప్రతి వ్యక్తి జీవితంపై ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం మకర, ధనుస్సు, కుంభ రాశుల పై శని సడే సతి ప్రభావం ఉంది. దీని వల్ల ఆ రాశి వ్యక్తులు శుభ లేదా అశుభ ప్రభావాలను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తి జాతకంలో శని బలంగా ఉంటాడో అతనికి శుభ ఫలితాలు వస్తాయి. ఎవరి కుండలిలో అయితే శని (Shanidev) బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది.శని వక్ర దృష్టి ప్రభావాలను తగ్గించడానికి జ్యోతిష్యశాస్త్రంలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సడే సతిపరిహారాలు
>> శనివారం శని దేవుడిని పూజించడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.
>> ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేయండి, వీలైనంత వరకు శనికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
>> శని బలపడాలంటే కుడిచేతి మధ్య వేలికి గుర్రపు డెక్కతో తయారు చేయబడిన ఉంగారాన్ని ధరించండి. అప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటుంది.
>> ప్రతి శనివారం శని దేవుడికి రాగి మరియు నువ్వుల నూనెను సమర్పించండి.
>> శనివారం శని స్తోత్రాన్ని పఠించండి.
>> శనివారాల్లో లేదా క్రమం తప్పకుండా కాకులకు, చీమలకు ఆహారం పెట్టండి.  
>> వికలాంగులకు వీలైనంత వరకు సేవ చేయండి.


సడే సతి సమయంలో ఈ పని చేయకండి
>> ఒక వ్యక్తి యొక్క జాతకంలో శని సడే సతి నడుస్తున్నట్లయితే.. వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  
>> డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
>> శని సడే సతి సమయంలో ఒంటరిగా ప్రయాణించడం మానుకోండి.
>> శనివారం రోజున నలుపు రంగు బట్టలు, తోలు వస్తువులు కొనకండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో శని గ్రహం బలహీనపడుతుంది.
>> మద్యం సేవించవద్దు మరియు తప్పుడు పనులకు దూరంగా ఉండండి. 


Also Read: Venus Transit 2022: మరో 4 రోజుల్లో శుక్ర సంచారం.. ఈ 3 రాశులవారికి అంతులేని ఐశ్వర్యం! 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook