Shanidev Vakri 2022 Effect: 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి శనిదేవుడు.. ఈ రాశిల వారికి కష్టాలు తప్పవు..!!
Shanidev Vakri 2022 Effect: జూన్ 5న శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడని జ్యోతిష్య శాస్త్రం తెలిపింది. అంతేకాకుండా శని మహారాజు ఈ అక్టోబర్ నెల వరకు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నారు. 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు తన రాశి అయిన కుంభరాశిలో ప్రవేశించడం విశేషం.
Shanidev Vakri 2022 Effect: జూన్ 5న శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడని జ్యోతిష్య శాస్త్రం తెలిపింది. అంతేకాకుండా శని మహారాజు ఈ అక్టోబర్ నెల వరకు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నారు. 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు తన రాశి అయిన కుంభరాశిలో ప్రవేశించడం విశేషం. అయితే ఈ సమయంలో కుంభరాశి చెందిన వారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, ఉద్యోగ రంగంలో వివిధ సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. వీరి జాతకంలో శని బలహీన స్థితిలో ఉన్నందునా..కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం..మరి కొన్ని రాశులవారికి సానుకూల ప్రభావం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఆ రాశులు ఎంటో తెలుసుకుందాం..
ఈ రాశులకు ప్రతికూల ప్రభావం తప్పదు:
శని దేవున్ని న్యాయ దేవుడని అంటారు. కర్మలను బట్టి వారి కర్మల ఫలాలను ప్రజలకు అందజేస్తారు. నిరుపేదలకు దానం చేసే వారిపై శని దృష్టి ఉండదు. జూన్ 5న శని తన సొంత రాశిలో సంచరించడం వల్ల ఈ 2 రాశులపై ప్రత్యేక ప్రభావం కనిపిస్తుంది. ఈ వ్యక్తుల జీవితంలో ఆనందం ఆగిపోదు.. వారి విధి మూసిన తలుపులు తెరుచుకుంటాయి.
ఈ రాశుల వారికి చాలా మేలు:
వృషభం: ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు. ఇంట్లో శుభ కార్యాలకు ప్రత్యేక యోగాలున్నాయి.
కన్య: ఈ వ్యక్తులు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ధనం, సంపదలో వివిధ రకాల మార్పులు వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు.
శని దేవుడిని మెప్పించే పరిహారాలు:
ఈ రాశుల వారు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అనుగ్రహాన్ని పొందడానికి పలు రకాల అంశాలను పాటించాల్సి ఉంటుంది. తద్వారా ప్రయోజనాలను పొందుతారు.
- శని దేవుడికి ఆవాల నూనెను నైవేద్యంగా పెట్టండి. అంతేకాకుండా ఈ నూనెతో దీపాన్ని కూడా వెలిగించండి.
- శని చాలీసా, శని మంత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయండి
- కుష్టు రోగులకు సేవ చేయండి. పేద, నిరుపేద ప్రజలకు దానం చేయండి.
-అహంకారం మానుకోండి. ఎవరినీ అవమానించకండి.
Also Read: Fennel Oil For White Hair: సోపు నూనె వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
Also Read: Saturn Retrograde 2022: కుంభరాశిలో శని తిరోగమనం... ఈ 5 రాశులవారి జీవితం అతలాకుతలం!
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook