Ganesh Chaturthi 2022: దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలో వినాయక చవితి ఒకటి. ఈ ఫెస్టివల్ ను భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు. పది రోజులపాటు జరుపుకునే ఈ పండుగ (Ganesh Chaturthi 2022) ఆగస్టు 31న ప్రారంభంకానుంది. అనంత చతుర్థి అంటే 9 సెప్టెంబర్ 2022 నాడు గణేశుడిని నిమజ్జనం చేస్తారు. ఈ వినాయక చవితి రోజున ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినాయక చవితి రోజు శుభయోగం
భాద్రపద శుక్ల చతుర్థి తిథి 30 ఆగస్టు 2022న మధ్యాహ్నం 3:34 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నం 3:23 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. అయితే కాకతాళీయంగా గణేష్ చతుర్థి నాడు రవియోగం ఏర్పడుతోంది. రవియోగంలో గణపతి బప్పను పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. అన్ని అశుభ యోగాలను తొలగించే శక్తి రవి యోగానికి ఉందని చెబుతారు. 31 ఆగస్టు 2022, ఉదయం 06.06  నుండి 1 సెప్టెంబర్ 2022, మధ్యాహ్నాం 12.12 వరకు రవి యోగం ఉంటుంది. 


వినాయక చవితి ప్రాముఖ్యత
వినాయక చవితి రోజున గణేశుడిని పూజించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. భాద్రపద శుక్ల పక్ష చతుర్థి నుండి ఈ భూమి  గణేశుడు పది రోజులు ఉంటాడని నమ్ముతారు. ఈపండుగ రోజున వినాయకుడు ప్రతి ఇంట్లోనూ ప్రతిష్టించబడతాడు.  ఈ రోజున గణపతిని పూజించడం వల్ల మీ జీవితంలోని ఒత్తిడి దూరమవుతుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. 


Also Read: Chanakya niti: ఈ 3 చెడు అలవాట్లను వీలైనంత త్వరగా వదిలేస్తే...విజయలక్ష్మీ మీ వెంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook