Navpancham Yog: అరుదైన యోగం చేస్తున్న మిత్ర గ్రహాలు.. ఇక ఈ 3 రాశులకు తిరుగుండదు...
Navpancham Yog: శుక్రుడు మరియు శని కలిసి నవపంచం రాజయోగం చేస్తున్నారు. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra and Shani Make Navpancham Yog: గ్రహాల కదలికలు ఒక్కోసారి శుభ మరియు అశుభ యోగాలను చేస్తాయి. తాజాగా శుక్రుడు, శనిదేవుడు అలాంటి ఒక యోగాన్నే చేస్తున్నారు. ప్రస్తుతం శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మరోవైపు శనిదేవుడు కుంభరాశిలో కూర్చుని ఉన్నాడు. ఈ సందర్భంగా నవపంచం రాజయోగం ఏర్పడుతుంది. పైగా వీరిద్దరు మిత్రులు. నవపంచం రాజయోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
తులారాశి
నవపంచం రాజయోగం తులరాశి వారికి మేలు చేస్తుంది. పైగా ఈ రాశికి అధిపతి శుక్రుడు. శని మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో మరియు శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటారు. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. శని మూల త్రికోణ రాజయోగం చేయడం వల్ల ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది.
ధనుస్సు రాశి
నవపంచం రాజయోగం ధనుస్సు రాశి వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా అస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ కెరీర్ లో అపారమైన పురోగతి ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు లాభపడతారు. బిజినెస్ విస్తరిస్తుంది.
కుంభ రాశి
కుంభరాశి వారికి నవపంచం రాజయోగం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పాత పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీరు చాలా శక్తివంతంగా మారతారు.
Also Read: Mahadhan Rajyog: 'మహాధన రాజయోగం'తో ఈ రాశులకు పట్టనున్న అదృష్టం.. మీది ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook