Shukra Asta 2022 Date: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ఆనందం ఐశ్వర్యం విలాసం ఆనందానికి కారకంగా సూచిస్తారు. అయితే శుక్రుడు ప్రతి సంవత్సరంలో రెండు దశలను కలిగి ఉంటాడు ఒకటి ఉదయించడం మరొకటి అస్తమించడం. అక్టోబర్ 2న అస్తమించిన శుక్రుడు నవంబర్ 20వ తేదీన ఉదయించాడు. శుక్రుడు ఉదయించడం వల్ల ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో వచ్చే ప్రభావం కొన్ని రాశుల వారికి మంచి అయితే మరికొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలు కలిగించవచ్చు. అయితే శుక్రుడు ఉదయించడం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారికి శుభ ఫలితాలు:


వృషభం:
వృషభ రాశి వారికి ఏడవ స్థానంలో శుక్రుడు ఉంటాడు. దీని కారణంగా ఈ రాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది. వివాహం చేసుకోవాలని చూస్తున్నావారు ఈ క్రమంలో వారి కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. కాబట్టి ఈ గ్రామంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించండి.


కర్కాటక:
కర్కాటక రాశి వారికి శుక్రుడు ఉదయించడం చాలా శుభప్రదం అని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రాశి వారి జాతకంలో శుక్రుడు ఐదో స్థానంలో ఉంటాడు కాబట్టి వైవాహిక జీవితంలో చాలా రకాల మార్కులు జరగవచ్చు. ముఖ్యంగా ఈ క్రమంలో అన్ని శుభవార్తలే వింటారు. పిల్లల చదువులు పురోగతి లభించి పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఇది సరైన సమయంలో భావించవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ దశలో ఆస్తులు వస్తువులు కొనుగోలు చేస్తారు.


సింహం:
శుక్ర దశ కారణంగా సింహ రాశి వారు కూడా ఊహించని ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు శారీరక ఆనందం పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఈ క్రమంలో ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రాశి వారు ఎలాంటి పనులు ప్రారంభించిన తప్పకుండా విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొన్నారు. ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే ఈ రాశి వారు ఈ క్రమంలో చాలా రకాలు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ క్రమంలో మంచి లాభాలు పొందవచ్చు. అంతేకాకుండా అన్ని పనుల్లో తల్లిదండ్రుల మద్దతు కూడా లభిస్తుంది.


Also Read : Ind Vs NZ: కాన్వే, ఫిలిప్స్ అర్ధసెంచరీలు.. సిరాజ్, అర్షదీప్ సూపర్ బౌలింగ్


Also Read : Nicholas Pooran: టీ20 వరల్డ్ కప్‌ ఎఫెక్ట్.. కెప్టెన్సీకి నిలోలస్ పూరన్ గుడ్ బై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook