Benefits of Lakshmi Yoga: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. రాక్షసులకు గురువుగా భావించే శుక్రుడు మే 30న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన యోగం జూలై 07 వరకు ఉంటుంది. దీని వల్ల నాలుగు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకర రాశి
లక్ష్మీ యోగం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ కెరీర్ లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు రుణ విముక్తి పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 
మేష రాశి
లక్ష్మీ యోగం వల్ల మేషరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీరు ఏదైనా ల్యాండ్ లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also read: Mangal shukra yuti 2023: కర్కాటక రాశిలో అరుదైన కలయిక.. 7 రాశులకు లాభం.. 5 రాశులకు నష్టం..


కర్కాటక రాశి
ఇదే రాశిలోనే శుక్రుడు లక్ష్మీ యోగం ఏర్పరిచాడు. దీని వల్ల కర్కాటక రాశివారు ఆర్థికంగా లాభపడనున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులు మంచి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది.
కన్య రాశి
లక్ష్మీ యోగం ఈ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగం సాధించాలనే వారి కోరిక నెరవేరుతుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 


Also read:  Shani Vakri 2023: అరుదైన యోగం చేస్తున్న తిరోగమన శని... ఈ 5 రాశులవారిపై నోట్ల వర్షం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook