Shukra Gochar in Scorpio 2024: లవ్, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. ప్రస్తుతం శుక్రుడు వృశ్చికరాశిలో ఉండి జనవరి 18 రాత్రి 08:56 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం జనవరి 29 న పూర్వాషాఢ నక్షత్రం మరియు ఫిబ్రవరి 09 న ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న మకరరాశిలోకి వెళ్తుంది. శుక్రుని రాశిలో మార్పు కారణంగా రెండు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభరాశి 
శుక్రుడు సంచారం వృషభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. జనవరిలో మీకు లవ్ సెట్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ దరిద్ర్యం మెుత్తం పోతుంది. మీరు ధనవంతులు అవుతారు. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
మిథున రాశి
ధనుస్సు రాశిలో  శుక్రుని సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. ఉద్యోగులకు జీతం పెరగడంతో ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది.  మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 


Also Read: Saturn Retrograde 2024: కొత్త ఏడాదిలో ఈ 3 రాశులను శనిదేవుడు ఇబ్బంది పెట్టనున్నాడు.. ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి