Venus Transit 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా కొన్ని శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ నెల 11న శుక్రుడు వృశ్చికరాశిలోకి (Venus Transit in Scorpio 2022) ప్రవేశించాడు. దీంతోపాటు పశ్విక్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల 3 రాశులవారు పేదరికం నుండి బయట పడతారు. ఈరాశులకు కెరీర్ లో పురోగతితోపాటు వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): శుక్రుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఏదైనా పాత వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. ఈ సమయంలో మీరు కుటుంబంతో అధిక సమయాన్ని గడుపుతారు. మీడియా, ఫ్యాషన్ డిజైనింగ్ రంగంతో సంబంధం ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. 
కర్కాటకం (Cancer): శుక్రుని రాశి మార్పు మీకు వృత్తి మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. , ఈ సమయంలో మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం పొందే అవకాశం ఉంది. పెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. ఆఫీసులో మీ స్థానాన్ని మెరుగు పరుచుకుంటారు. 
సింహం (Leo): శుక్ర గ్రహం రాశిచక్రం మారిన వెంటనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. నిరుద్యోగులకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలలో భారీ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.


Also Read: Tirgrahi Yog: వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం.. వీరికి మంచి రోజులు ప్రారంభం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి