Shukra Gochar 2022: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహం పరిగణిస్తారు. ప్రేమ, శృంగారం, సంపద, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. ఏదైనా గ్రహం యెుక్క సంచారం లేదా తిరోగమనం ప్రజలందరి జీవితాలపై ఎంత కొంత ప్రభావాన్ని చూపుతాయి. అక్టోబరు 18, రాత్రి 9:22 గంటలకు శుక్రుడు కన్యారాశిని విడిచిపెట్టి తన సొంత రాశి అయిన తులరాశిలోకి (Venus Transit in libra 2022) ప్రవేశిస్తాడు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సుఖాలను పొందుతాడు. ఏ వ్యక్తి కుండలిలో అశుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. శుక్రుని సంచారం వల్ల ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): ఈ రాశి యెుక్క రెండో ఇంటికి శుక్రుడు అధిపతి. మేషరాశిలోని ఏడో ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. మీరు కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయ అవకాశాలను పొందుతారు. వ్యాపారస్థులు భారీగా లాభాలను గడిస్తారు. మీ మాటలతో అందరి మనసులను గెలుచుకుంటారు. మీరు సీనియర్ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. శుక్రుని సంచారం మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది. మీరు అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు సంతోషకరమైన క్షణాలను గడిపే అవకాశాలను పొందుతారు.


కన్య (Virgo): కన్యారాశికి శుక్రుడు అధిపతి. ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. దీంతో ఈ రాశివారి సంపద పెరుగుతుంది. శుక్రుని సంచారం వల్ల ఈరాశివారికి వృత్తిపరంగా ప్రయోజనం కలుగుతుంది. మీరు ఇంతకు ముందు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అది లాభదాయకంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులు మరియు బంధువులు సపోర్టు మీకు లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. 


ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో శుక్రుని సంచారం జరుగుతుంది. దీంతో మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కోరికలు నెరవేరుతాయి. సన్నిహితుల సపోర్టు లభిస్తుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేసే వారికి విజయం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది. 


మకరరాశి (Capricorn): మకర రాశి యెుక్క ఐదో, పదో ఇంటికి శుక్రుడు అధిపతి. శుక్రుని సంచారం ఈ రాశి యెుక్క పదవ ఇంట్లో జరుగుతుంది. ఉపాధి లభిస్తుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరుగుతుంది. బిజినెస్ విస్తరించడానికి ఇదే మంచి సమయం. మీరు ఆస్తి లేదా వాహనం ద్వారా ఆనందాన్ని పొందుతారు. టోటల్ గా ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 


Also Read: కుజుడు రాశి మార్పు.. 10 రోజుల తర్వాత ఈ రాశులవారి ఫ్యూచర్ మారడం పక్కా.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook