Malavya Rajyog: మీన రాశిలో అరుదైన యోగం.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు..
Malavya Rajyog: మీనరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
Malavya Rajyog In Pisces 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ గ్రహ గమనంలో వచ్చే మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి 15న మీన రాశిలో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన మాలవ్య రాజయోగం (Malavya Rajyog) ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి అపారమైన సంపదతోపాటు పురోభివృద్ధిని ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మాలవ్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మీన రాశిచక్రం (Pisces): మాలవ్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ జాతకంలోని లగ్న గృహంలో సంచరించబోతుంది. దీంతో మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో లాభాలు మెండుగా ఉంటాయి. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది.
కర్కాటక రాశిచక్రం (Cancer): మాలవ్య రాజయోగం మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం ఉంటుంది. మీ కెరీర్ లో అపారమైన పురోగతి ఉంటుంది. మీరు పని నిమిత్తం వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఆద్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి (Taurus): మాళవ్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేటివ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను గడిస్తారు. మీ కెరీర్ లో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది.
Also Read: Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన శని.. ఇక ఈరాశులకు తిరుగుండదు మరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.