Shukra Rashi Parivartan 2023:  ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుతున్నాయి. వీటి సంచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఇవాళ అంటే జనవరి 22, ఆదివారం నాడు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడి రాశి అయిన కుంభరాశిలోకి వెళ్తున్నాడు శుక్రుడు. ఈరోజు ఈ రెండు గ్రహాల కలయిక జరగనుంది. వీటి సంయోగం కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. కుంభరాశిలో శుక్రుని సంచారం కారణంగా కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారు జాగ్రత్త
కర్కాటకం (Cancer): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఈ రాశి వారి జాతకంలో ఎనిమిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో వీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ సమయంలో విలువైన వస్తువును కోల్పోతామనే భయం కూడా వెంటాడుతుంది. కొంత మంది మాత్రం ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. 


తులారాశి (Libra): జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ రాశిచక్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు. ఇది ఈ రాశిచక్రం యొక్క ఐదవ ఇంట్లో సంచరించబోతోంది. శుక్రుని సంచారం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోంటారు. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 


కన్య (Virgo): ఈ రాశికి చెందిన వారు శుక్రగ్రహ సంచారం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో చిన్న చిన్న తగాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అందుకే సంయమనంతో వ్యవహారించండి. శుక్రుని సంచారం వల్ల కన్యారాశి వారికి వెన్నునొప్పి లేదా కాళ్ళ నొప్పులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.


మీనరాశి (Pisces): ఈ రాశిచక్రంలోని పన్నెండవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. మీరు ఆర్థికంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవల్సి ఉంటుంది. తప్పుడు సహవాసం చేయడం వల్ల మీరు ఇబ్బందులకు గురువుతారు. ప్రయాణాలు మీకు అంతగా అనుకూలించవు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ సమయంలో మీరు చిన్న పొరపాటు చేసిన పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.  


Also Read: Jaya Ekadashi 2023: జయ ఏకాదశి ఎప్పుడు? దీని యెుక్క ప్రాముఖ్యత ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook