Jaya Ekadashi 2023: జయ ఏకాదశి ఎప్పుడు? దీని యెుక్క ప్రాముఖ్యత ఏంటి?

Jaya Ekadashi 2023: మాఘమాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. జయ ఏకాదశి ఉపవాసం యొక్క తేదీ, శుభ సమయం మరియు శుభ యోగాన్ని తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 04:44 PM IST
Jaya Ekadashi 2023: జయ ఏకాదశి ఎప్పుడు? దీని యెుక్క ప్రాముఖ్యత ఏంటి?

Jaya Ekadashi 2023 Significance: మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. కురుక్షేత్రంలో భీష్ముడు తనువు చాలించే సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాలను భోదించిన పరమ పవిత్రమైన రోజే ఈ ఏకాదశి. అందుకే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. అంతేకాకుండా ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా విజయవంతం అవుతుందట. అందుకే దీనికి జయ ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు యెుక్క "ఉపేంద్ర" రూపాన్ని పూజిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండి పూజలు చేయడంతోపాటు బ్రహ్మణులకు అన్నదానం చేయడం వల్ల మనిషి భూత, ప్రేత, పిశాచాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. జయ ఏకాదశి ఉపవాసం యొక్క తిథి, శుభ సమయం మరియు శుభ యోగం గురించి తెలుసుకుందాం. 

జయ ఏకాదశి 2023 తేదీ (Jaya Ekadashi 2023:date)
మాఘ శుక్ల పక్షం యొక్క జయ ఏకాదశి వ్రతం ఫిబ్రవరి 1, 2023న జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువును పసుపు బట్టలు ధరించి పూజించాలి మరియు ముఖ్యంగా జయ ఏకాదశి నాడు శ్రీ హరికి పీతాంబరి సమర్పించాలి. ఇది జీవితంలో సానుకూల శక్తిని ప్రసారం చేస్తుందని చెబుతారు.

జయ ఏకాదశి 2023 ముహూర్తం (Jaya Ekadashi 2023 Muhurat)
పంచాంగం ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షం యొక్క జయ ఏకాదశి తిథి జనవరి 31, 2023న ఉదయం 11:53 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 1, 2023న మధ్యాహ్నం 02:01 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, జయ ఏకాదశి వ్రతాన్ని ఫిబ్రవరి 1, 2023న జరుపుకుంటారు. 

జయ ఏకాదశి ఉపవాస సమయం - ఉదయం 07.12 - 09.24 (ఫిబ్రవరి 2, 2023)
జయ ఏకాదశి 2023 శుభ యోగ (Jaya Ekadashi 2023 Shubh Yog)
జయ ఏకాదశి రోజున చాలా అరుదైన యాదృచ్ఛికం జరుగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన జయ ఏకాదశి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఫిబ్రవరి 02వ తేదీ ఉదయం 07.13 నుండి మరుసటి రోజు ఉదయం 03.23 వరకు ఉంటుంది. మరోవైపు ఈ రోజు ఉదయం 11.30 గంటల నుంచి ఇంద్రయోగం కొనసాగుతుంది.

జయ ఏకాదశి పూజ విధానం (Jaya Ekadashi Puja Vidhanam)
జయ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పసుపు, తులసి పూజ చేయాలి. విష్ణుమూర్తి చిత్రపటానికి పసుపు చందనం లేదా కుంకుమను పూయండి. అనంతరం ఆ దేవుడికి పువ్వులు మరియు భోగాన్ని సమర్పించండి. ''ఓం భూరిద భూరి దేహినో, మా దభ్రం భూర్య భర్. భూరి ఘేదీంద్ర దితసీ। ఓం భూరిద త్యసి శ్రుత్: పురుత్ర శూర్ వృత్రహన్. ఆ నో భజస్వ రధసి.'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. చివరగా హారతి ఇచ్చి... మీ స్తోమత మేరకు  దానం చేయండి. 

Also Read: Khappar Yog: 30 ఏళ్ల తర్వాత శనిదేవుడి రాశిలో అరుదైన యోగం.. ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News