Mahalaxmi Rajyog In 2023: జ్యోతిష్యం దృష్ట్యా 2023 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నూతన సంవత్సరంలో అనేక గ్రహాల కదలిలలో మార్పులు చోటుచేసుకుంటాయి. శనిదేవుడు త్రికోణ స్థితిలో కుంభరాశిలోకి, ఫిబ్రవరి 15న శుక్రుడు ఉన్నతమైన మీనరాశిలోకి (Shukra Gochar 2023)ప్రవేశించనున్నాడు. దీని వల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం(Cancer): మహాలక్ష్మి రాజయోగం మీ జాతకంలోని అదృష్ట స్థానంలో ఏర్పడుతుంది. దీంతో మీకు లక్ కలిసి వస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కలల ఫలిస్తాయి. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది.
కన్య రాశిచక్రం (Virgo): కన్యా రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. మహాలక్ష్మి రాజయోగం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇది మీ రాశి నుండి సప్తమ స్థానంలో ఏర్పడుతుంది. మీ లైఫ్ పార్టనర్ సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మీరుఈ సమయంలో కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 


కుంభం (Aquarius): మహాలక్ష్మి రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 
మిథునం (Gemini): మహాలక్ష్మి రాజయోగం మిథున రాశి వారికి వృత్తి, వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో పదో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో మీరు వ్యాపారంలో ఊహించని లాభాలను  పొందుతారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. 


Also Read: Surya Shani Yuti 2023: శని, సూర్యల 'అశుభ యోగం'.. 2023లో వీరి జీవితం కష్టాలమయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.