Shukra Rise In November 2022: అంతరిక్షంలో ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ప్రేమ, అందం మరియు సంపదను ఇచ్చే శుక్రుడు నవంబరు 20వ తేదీన వృశ్చికరాశిలో ఉదయించబోతున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. వృశ్చికరాశిలో శుక్రుడు ఉదయించడం (venus Rise in Scorpio 2022) వల్ల మూడు రాశులవారు ఆకస్మిక ధనలాభం మరియు పురోగతిని సాధిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహం (Leo): శుక్ర గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఉదయించబోతోంది. దీంతో మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మీరు పురోగమిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు మీ ఫ్యామిలీ సపోర్టును పొందుతారు. 
వృషభం (Taurus): శుక్రుడు మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. భాగస్వామ్యంతో చేసే పనులు మీకు లాభాలను ఇస్తాయి. మీకు కుటుంబ మద్దతు ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో చేసే పనులు లాభాలను ఇస్తాయి. మెుత్తం మీద ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
కర్కాటకం (Cancer): శుక్రుడు మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీని వల్ల కర్కాటక రాశివారు అపారమైన ప్రయోజనాన్ని పొందనున్నారు. మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వింటారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Tirgrahi Yog: వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం.. వీరికి మంచి రోజులు ప్రారంభం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి