Shukra Pradosh Vrat 2022: అశ్వినీ మాసంలోని ప్రదోష వ్రతం శుక్రవారం నాడు వస్తుంది కాబట్టి దీనిని శుక్ర ప్రదోష వ్రతం అంటారు. ఈ రోజున శివుడిని (Lord Shiva) ఆరాధిస్తారు. తద్వారా మహాదేవుని అనుగ్రహంతో అష్టఐశ్వర్యాలు, సకల సౌభ్యాగాలు కలుగుతాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రదోష పూజ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆశ్వినీ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి శుక్రవారం, సెప్టెంబర్ 23న ఉదయం 01.17 గంటలకు ప్రారంభమై... సెప్టెంబర్ 24, శనివారం తెల్లవారుజామున 02:30 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి మరియు ప్రదోష పూజ ముహూర్తం ఆధారంగా శుక్ర ప్రదోష వ్రతాన్ని సెప్టెంబర్ 23న జరుపుకోనున్నారు. సెప్టెంబర్ 23న శుక్ర ప్రదోష పూజకు అనుకూలమైన సమయం సాయంత్రం 06.17 నుండి రాత్రి 08.39 వరకు. ఈ రోజున ఉపవాసం ఉండేవారికి శివారాధనకు 02 గంటల కంటే ఎక్కువ సమయం లభిస్తుంది. 


ఇదే రోజు రెండు శుభయోగాలు
ఈ శుక్ర ప్రదోష వ్రతం రోజే సిద్ధ, సాధ్య యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున సిద్ధయోగం ఉదయం నుండి ఉదయం 09:56 వరకు ఉంటుంది. దాని తర్వాత సాధ్యయోగం ప్రారంభమై..మరుసటి రోజు ఉదయం 09:43 వరకు ఉంటుంది. ఈ రెండు యోగాలు శుభప్రదమైనవి.


Also Read: Rahu Transit 2022: రాహు, శని గ్రహాల బలమైన యోగం... ఈ రాశులవారికి భారీ లాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook