Shukra Rashi Parivartan 2022: కన్యారాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి ఈ వారం అంతా ధన ప్రవాహమే..
Shukra Rashi Parivartan 2022: గ్రహాల్లో కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్ట సమయంలో వాటి రాశుల్లోకి అవి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ వారం సెప్టెంబర్ 24న శుక్ర గ్రహం ఈ సంచారం చేయబోతోంది. అత్యంత ముఖ్య రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు.
Shukra Rashi Parivartan 2022: గ్రహాల్లో కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్ట సమయంలో వాటి రాశుల్లోకి అవి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ వారం సెప్టెంబర్ 24న శుక్ర గ్రహం ఈ సంచారం చేయబోతోంది. అత్యంత ముఖ్య రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడిని శాస్త్రంలో లగ్జరీ, సంపద, వైభవం, శృంగారం, ఐశ్వర్యంగా పరిగణిస్తారు. కాబట్టి మొత్తం ఈ ప్రభావం 12 రాశిచక్రాలపై పడబోతున్నట్లు సమాచారం. శుక్రుని సంచారం వల్ల ఈ 3 రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశులు సంచారం వల్ల మంచి లాభాలు కూడా పొందుతారు. అయితే ఈ ప్రయోజాలు ఏ రాశులవారు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
3 రాశులపై శుక్ర సంచారము శుభ ప్రభావం:
వృషభం రాశి:
వృషభ రాశి వారిపై చాలా మంచి ప్రభావవం పడబోతోంది. దీంతో ఈ రాశి వారిలో పలు రకాల మార్పులు సంభవించవచ్చు. ముఖ్యంగా శుక్రుని సంచారం వల్ల ఈ రాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందగలుగుతారు. వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం కానుక ఆదాయ విషయంలో కూడా చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరు వ్యాపారల పరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. జీవితంలో డబ్బు సమస్యలతో బాధపడేవారు దీని నుంచి సులభంగా ఉపశమనం పొందగలుగుతారు.
మిథునం రాశి:
శుక్ర రాశిలో మార్పుల కారణంగా మిథున రాశి వారు చాలా శుభ ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా డబ్బు పరంగా మంచి లాభాలు పొందనున్నారు. ఇటీవలే స్థాపించిన వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు పొందుతారు. వీరు వ్యాపారం కూడా విస్తరించే అవకాశాలున్నాయి. కుటుంబంలో సుఖ, సంతోషాలు కూడా పొందగలుగుతారు. వీరు జీవితంలో లగ్జరీ కూడా పొందగలుగుతారు.
కన్య:
ఈ వారం శుక్రుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ధనం లాభాలు కూడా పొందుతారు. వీరు వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇదే క్రమంలో ఊహించని లాభాలు పొందుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok